Pawan kalyan Letter: ప్రియమైన జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం అంటూ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ మధ్య కొన్ని విషయాల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీల మధ్య కామెంట్లు వివాదాస్పందంగా మారుతున్నాయి.. ఈ తరుణంలో ‘జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.. ఎవరూ అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్. ‘కూటమిలోని మూడు పార్టీల శ్రేణులూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున కూడా ఎవరైనా స్పందించినా, మరెవరూ ప్రతిస్పందించొద్దు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దు. బహిరంగంగా చర్చించొద్దు అని సూచిస్తూ.. జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ విడుదల చేశారు పవన్ కల్యాణ్.
Read Also: Rohit Sharma: ఆ ఊహ కూడా నన్నెంతో బాధిస్తుంది.. అభిమాని ఎమోషనల్ లేఖ
2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ – టీడీపీ – బీజేపీ.. ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం, ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు.. గత ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్ట సభల్లో వారు చేసిన జుగుస్పాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావులేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పులు ఆంధ్రప్రదేశ్‌గా మార్చడంపై విసుగు ,ఎందిన రాష్ట్ర ప్రజలు, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, బావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94 శాతం విజయంతో 175 స్థానాల్లో 164 స్థానాలను ఎన్డీఏ కూటమికి.. 100 శాతం స్టైక్ రేట్‌తో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21, రెండు పార్లమెంట్ స్థానాల్లో రెండు స్థానాలను జనసేన అభ్యర్థులను గెలిపించారు అని పేర్కొన్నారు పవన్ కల్యాణ్..
Read Also: Astrology: జనవరి 27, సోమవారం దినఫలాలు
ఇక, 5 కోట్ల మంది ఆశల్ని నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయీచేయీ కలిపి నడవాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు పవన్.. నేను ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చేయలేదు. భవిష్యత్తులోనూ చేయను. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవడం, వారికి అండగా నిలబడడం, పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే నాకు తెలుసు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని కోరారు.. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని లేఖలో రాసుకొచ్చారు.. కూటమి విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా భావించి, అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..