KTR: ధన్యవాదాలు CBN గారు.. మీ పాత శిష్యుడికి అవగాహన కల్పించండి..!
- ఏపీ సీఎం చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు..
- తెలంగాణ తలసరి ఆదాయంపై మాట్లాడిన వీడియో షేర్..
- చంద్రబాబు అనేక సందర్భాల్లో నిజాయితీగా అంగీకరించారు..
- వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పాత శిష్యుడుకి అవగాహన కల్పించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పలు సందర్భాల్లో తెలంగాణ అభివృద్ధిపై.. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి, సైబరాబాద్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చాలా వేదికల్లోనూ ప్రశంసలు కురిపించారు.. తాజాగా, దావోస్ పర్యటనలో ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలో పాల్గొన్న కార్యక్రమంలోనూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందంటూ చంద్రబాబు కీర్తించారు.. ఇక, సోమవారం మీడియా సమావేశంలోనూ మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉంది.. దానికి అక్కడి పాలసీలే కారణంగా పేర్కొన్నారు.. దీనిపై స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.. ఇదే సమయంలో.. సీఎం రేవంత్‌రెడ్డికి చురకలు అంటించే ప్రయత్నం చేశారు.
Read Also: Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.. ఏపీ సీఎం మీడియాతో మాట్లాడిన క్లిప్‌ను ట్యాగ్ చేసిన కేటీఆర్.. “ప్రభుత్వ ప్రగతిశీల విధానాల వల్లే భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం (Highest per capita income) కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ఏపీ సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో నిజాయితీగా అంగీకరించారని పేర్కొన్నారు.. ఇక, ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు.. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పాత శిష్యుడుకి దయచేసి అవగాహన కల్పించండి అని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచిస్తూనే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. అయితే, సీబీఎన్‌కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.
Chief Minister of AP @ncbn Garu has candidly acknowledged on several occasions that Telangana has become the state with the highest per capita income in India because of progressive Govt policies over the last one decade
Thank you CBN Garu. Please educate your erratic erstwhile… pic.twitter.com/XBxyvtAI7x
— KTR (@KTRBRS) January 28, 2025
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!