అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజక వర్గ ఎమ్మెల్యేగా వరసగా నాలుగు సార్లు గెలుపొందిన సీనియర్ శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ హోదా దక్కనుంది. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ గా వేగుళ్ల నియమితులు కానున్నారు. ఇవాళ అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్ గా నియమితులు కానున్నారు.. ఈ మేరకు వేగుళ్లకుకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ కూడా... పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో... ఆసక్తి నెలకొంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరుగుతుంది.
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి.. తాజాగా కడపలో.. అనకాపల్లిలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాప్ (ఏపీ స్పోర్ట్స్ అథారిటీ) ఛైర్మన్ రవినాయుడు..పెద్ద అవినీతి తిమింగలం మాజీ మంత్రి ఆర్కే రోజా అని ఆరోపించారు.. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిలువు దోపిడీ చేశారని విమర్శించారు.. కేవలం ఎన్నికల స్టంట్స్ కోసం ప్రభుత్వ సొమ్మును దుబారాగా దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు..
మందు తాగే తమ్ముళ్ల వల్లే గత ఎన్నికల్లో వైసీపీతో పాటు తాను ఓటమి పాలయ్యాని అని వ్యాఖ్యానించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. మా ప్రభుత్వంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారని కూటమి నేతలు ఎన్నికల్లో చేసిన మాటలు నమ్మి మందు బాబులు కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. అయితే, ఎన్నికల తర్వాత మందు బాబులను, మద్యం వ్యాపారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఆరవై సంవత్సరాల కిందట ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కష్టనష్టాల్లో కలిసి నడిచారు. చివరికి ఈ లోకాన్ని కూడా కొద్ది గంటల వ్యవధిలోనే నువ్వు లేక నేను లేను అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు..
విశాఖపట్నంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. విశాఖ కాలుష్య నివారణకు, పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్య నివారణ చేపడతాం అన్నారు..
లిప్ట్ స్కీమ్‌ల నిర్వహణ, మోటార్ల మరమ్మత్తులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా వైఎస్ జగన్ ఎత్తిపోత పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. 1,040 లిఫ్ట్ స్కీమ్‌లకు గాను 450 లిఫ్ట్ స్కీమ్‌లు మూతపడ్డాయని ఆరోపించారు.. ఇక, తాళ్లూరు లిఫ్ట్ పైపులు సిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే.. పుష్కర మెయిన్ కెనాల్ తాళ్లూరు లిఫ్ట్ బ్లాక్ కాటన్ సాయిల్ కావడం వల్ల బ్రేక్ అవుతోందన్నారు.