కేజీ నుండి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తాం అన్నారు మంత్రి నారా లోకేష్.. బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల్లో నేను దేవుడ్ని చూస్తాను.. ప్రతి పిల్లవాడి అభివృద్ధి వెనుక వాళ్ల తల్లిదండ్రులు ఉంటారు.. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అభివృద్ధి కోసం.. విద్యార్థుల తల్లిదండ్రులతో.. ఉపాద్యాయులతో కలిపి సమావేశం పెట్టాం అన్నారు.
అమరావతిలో భవనాలను పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. డిసెంబర్ 15వ తేదీ నుండి బిల్డింగ్ యాక్టివిటీని ప్రారంభించనుంది.. ఎంపిక చేసిన కొన్ని కన్స్ట్రక్షన్ మేజర్లకు వివిధ ప్రాజెక్ట్ వర్క్‌లు అప్పజెప్పనున్నారు.. ఇక, పాత కాంట్రాక్టులను రద్దు చేసి తాజాగా బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం విదితమే.. కానీ, సాధ్యమైనంత వరకు పాత కాంట్రాక్టర్ల తోనే పని జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.. బిడ్డింగ్ ప్రక్రియకు అధికారిక గడువు త్వరలో ముగియగానే ఎంచుకున్న సంస్థలకు వర్క్ ఆర్డర్లు జారీ చేయనున్నారు..
ఏపీలో ఈ రోజు రెవెన్యూ గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.. అయితే, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక, సీఎం సహాయ నిధికి, సంబంధించి స్థానిక వీఆర్వో గంగన్న తనను 2 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని, గ్రామ సభలో ఓ మహిళ మంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. అయితే, ఉన్నట్టుండి ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన కూతరు సునీతరెడ్డి.. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టు జారీ చేసిన బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అంతేకాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్ వేసింది సీబీఐ.. ఇక, సునీత రెడ్డి, సీబీఐ పిటిషనల్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. మరోవైపు తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా…
టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయిందన్నారు సీఎం చంద్రబాబు.. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతోందన్న ఆయన.. సాంకేతికతతో అనేక మార్పులు వస్తున్నాయన్నారు.. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలని అనుకుంటున్నాం అన్నారు.. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణగా అభిర్ణించారు.. ఇక, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నామని వెల్లడించారు ఏపీ సీఎం..
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి సురేష్ గోపీ నోట తెలుగు పాట వచ్చింది.. సామజవరగమనా.. అంటూ పాట పాడుతూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు కేంద్ర సహాయమంత్రి సురేష్ గోపీ.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్నారు సురేష్ గోపీ. తెలుగు సినిమా చాలా అద్భుతం అన్నారు సురేష్ గోపీ.. తెలుగు వాళ్లకి నేను అవకాశాలు ఇస్తాను.. తెలుగు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటులు చాలా ప్రభావం చూపిస్తారంటూ ప్రశంసలు కురిపించారు.. తెలుగు స్క్రిప్ట్ కూడా చాలా అర్ధవంతంగా ఉంటుంది.. తెలుగు…
కర్నూలు జిల్లాలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోలగుంద మండలం హెబ్బటంలో తల్లి, బిడ్డను హత్య చేసింది భర్తే అని నిర్ధారణకు వచ్చారు స్థానిక పోలీసులు.. భార్య సలీమా(24) , కూతురు సమీరా(4) ను భర్త సక్రప్ప గొంతు నులిమి చంపినట్లుగా విచారణలో తేల్చారు పోలీసులు.. అయితే, బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందని భర్త సక్రప్ప మొదట ప్రచారం చేసిన విషయం విదితమే..
ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయి.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పరిష్కారం కాని భూ సమస్యలను.. సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.