రెవెన్యూ సదస్సులకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించనున్నట్టు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు డిసెంబర్ 6, 2024 - జనవరి 8, 2025 వరకు నిర్వహిస్తామన్నారు.. గ్రామస్థాయిలో భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్లపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడవొద్దు.. 6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించ వద్దు అని స్పష్టం చేశారు..
పెళ్లంటే.. హిందూ సంప్రదాయంలో ఓఅపురూప వేడుక. చేతిలో డబ్బులుండొచ్చు... లేకపోవచ్చు.. అప్పు చేసైనా ఆ జీవితకాల ఆనందాన్ని సొంతం చేసుకోవాలని వధూవరుల తల్లితండ్రులు, కుటుంబసభ్యులు భావిస్తారు. అందుకే వీలైనంత ఘనంగా కల్యాణ వేడుకలు జరుపుతారు.
నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశంకానున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. క్యాంప్ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు..
ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు PSLV-C59 రాకెట్ను ప్రయోగించనుంది ఇస్త్రో.. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.. శాస్త్రవేత్తలతో సమీక్షిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విశాఖపట్నం రానున్నారు.. ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ముంబైలోని ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్.. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విశాఖ రానున్నారు..
అవాంచనీయ ఘటనలకు కేంద్రంగా మారిందంటూ విశాఖ సెంట్రల్ జైల్పై ఆరోపణలు వచ్చితన తరుణంలో ప్రక్షాళన ప్రారంభించింది ప్రభుత్వం.. గంజాయి ఖైదీలతో మిలాఖత్ ఆరోపణలు రుజువవ్వడంతో ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు పడింది. పర్యవేక్షణ లోపం కారణంగా పరిస్థితులు అదుపుతప్పడానికి బాధ్యులైన సూపరింటెండెంట్ ఎస్.కిషోర్కుమార్, అదనపు కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నేడు ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది.. ఉదయం 8 గంటలకు అంటే కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.