తిరుమలలో కారులో మంటలు చెలరేగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కారు దగ్ధమైంది.. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భక్తులు పరుగులు తీశారు.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు.. అప్పటికే మంటల్లో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల అని పేర్కొన్నార ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..తాము అధికారంలోకి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు బతికి ఉంటే... జైలుకు పంపుతామన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై గొట్టిపాటి రవి మండిపడ్డారు..
త్వరలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఒక కీలక ప్రకటన చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఆంధ్ర యూనివర్సిటీని ఐదేళ్లలో టాప్ 3లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.. ప్రపంచ స్థాయిలో ఆంధ్ర యూనివర్సిటీని టాప్ యూనివర్సిటీలో ఒకటిగా ఉంచాలన్నారని తెలిపారని గుర్తుచేసుకున్నారు..
కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయారు.. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల అనే యువతిపై కులయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశారు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు రావడంతో వారిని చూసి కులయప్ప పరారయ్యారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఆకాక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 1998లో విద్యుత్ రంగ సంస్కరణలు తీసుకొచ్చాం.. 2004కి మనం పవర్ వినియోగంలో పొదుపులో ఉన్నాం.. విద్యుత్ రంగంలో ఏపీని మొదటి ర్యాంకు కు తెస్తాం టీడీపీ హయాంలోనే అన్నారు సీఎం చంద్రబాబు..
పార్వతీపురం మన్యం జిల్లా జీఎం వలస మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో కుండెన పారమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బహిర్భూమికి వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి పొలాల్లోనే చంపేశాయి.
మంత్రి సవిత.. హిందూపురం ఎంపీ పార్థసారథి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చారు హిందూపురం ఎంపీ పార్థసారథి.. కార్యకర్తల్ని విస్మరిస్తే, వారిని కాపాడలేక పోతే నాయకులకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.. కానీ, మంత్రి సవితకు నాకు ఎటువంటి గొడవలు లేవు, కలిసే పని చేస్తాం అంటూ ఎంపీ పార్థసారథి వారి ఇరువురి మధ్య ఉన్న వైరానికి తెరదించారు.
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు.. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో 5 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.