Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో.. రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్‌కు యువ క్రికెటర్ ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో ఒక స్పెషల్ విజిట్ అందరినీ ఆకర్షించింది. ఇటీవల ముగిసిన T20 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు, తెలుగు తేజం తిలక్ వర్మ ‘పెద్ది’ సెట్స్‌లో సప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సాన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో.. తిలక్ వర్మ షూటింగ్ స్పాట్‌కు చేరుకుని రామ్ చరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తర్వాత సెట్‌లో చిత్రీకరిస్తున్న ఇంటెన్స్ స్పోర్ట్స్ సీక్వెన్స్‌లను తిలక్ ఎంతో ఆసక్తిగా గమనించారు. అనంతరం చిత్ర బృందం తిలక్ వర్మకు ఒక స్పెషల్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా అందజేసింది.
READ ALSO: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ ‘రివెంజ్’ షురూ.. సినిమాలో యామీ గౌతమ్ సర్ప్రైజ్ రోల్ ఇదే!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఏప్రిల్ 30న థియేటర్స్‌లో ‘పెద్ది’ గర్జన..
రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
T20 World Cup champion @TilakV9 visited the sets of #Peddi ❤🔥
He caught a glimpse of the film’s sports sequences and was thoroughly impressed.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/D5i8u7cTpg
— BuchiBabuSana (@BuchiBabuSana) March 18, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?