ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదయింది. టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మరణంతో బైఎలక్షన్ జరిగిన విషయం విదితమే కాగా.. బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్య జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు టీచర్లు బారులు తీరారు. యూనియన్ల వారీగా విడిపోయి ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు మద్దతు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న బియ్యం అక్రమ రవాణా కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. కాకినాడ తీరంలో రేషన్ బియ్యంతో స్టెల్లా నౌక పట్టుబడటం, అక్రమ రవాణా వెనుక యంత్రాంగం అలసత్వం, మాఫీయాను మించిన నెట్వర్క్ ఏర్పడిపేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న తీరుపై సీరియస్ అయ్యింది. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సమగ్ర విచారణ కోసం CBCID కి అప్పగించాలని నిర్ణయించింది. రే
రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. కోర్టులకు వెళ్లకుండా సర్కార్ పరిధిలో పరిష్కరించే సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సదస్సులు జరుగుతాయి.
మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ ఫోరం సస్టెయినబుల్ ట్రాన్స్ఫార్మేషన్ GFST ఆధ్వర్యంలో "డీప్ టెక్ సమ్మిట్-2024"కు వేదికైంది. ఇక, ఈ కీలక సమ్మిట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సదస్సులోనే వచ్చే ఐదేళ్ల కాలానికి రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం వుంది.
విహారయాత్రకు వచ్చిన ఓ మిత్ర బృందంలోని మిత్రుల మధ్య వేసుకున్న పందెంలో ఓ యువకుడు విగత జీవిగా అనుమానాస్పద రీతిలో ప్రాణం కోల్పోయిన ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) అనే యువకుడు, మరో 9 మందితో స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.. స్నే
అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. గత ప్రభుత్వం వసతి దీవెన పథకానికి కేటాయించిన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామన్నారు..
పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు..