Iran-Israel: మరో టాప్ లీడర్‌ను లేపేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ నిఘా మంత్రి హతం అయినట్లు ప్రకటన
- మరో టాప్ లీడర్‌ను లేపేసిన ఇజ్రాయెల్
- ఇరాన్ నిఘా మంత్రి హతం అయినట్లు ప్రకటన
- నిన్న ఖమేనీ కుడిభుజం అలీ లారిజానీ హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ టాప్ లీడర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు కీలక నేతలను అంతమొందించగా.. నిన్నటికి నిన్న ఖమేనీకి కుడిభజంగా ఉన్న ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ సోలేమానీని హతమార్చగా.. తాజాగా మరొక కీలక నేతను చంపేసింది. ఐడీఎఫ్ చేపట్టిన వైమానిక దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీంతో ఇరాన్ కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ పని చేస్తున్నట్లుగా అర్ధమవుతోంది.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: దేవెగౌడపై ఖర్గే పంచ్‌లు.. నవ్వులు చిందించిన మోడీ
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, కీలక ప్రభుత్వ పెద్దలు హతమయ్యారు. ఈ ఘటనలో ఖమేనీ కుమారుడు మోజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇంతలోనే ఇరాన్ కీలక నేతలను టార్గెట్‌గా పెట్టుకుని ఇజ్రాయెల్ హతమార్చుతోంది. ఇక ఈ దాడులను రష్యా ఖండించింది.
ఇదిలా ఉంటే నిన్న ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ అంతిమయాత్రకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Russia-India: ఉగాది వేళ భారత్‌కు శుభపరిణామం.. నడిసంద్రంలో చైనాకు రష్యా ట్యాంకర్ షాక్
🔴ELIMINATED: Esmaeil Khatib, the Iranian terrorist regime Minister of Intelligence, in a targeted strike in Tehran.
Khatib played a significant role during the recent protests throughout Iran, including the arrest & killing of protestors and led terrorist activities against… pic.twitter.com/654lpYCZ1c
— Israel Defense Forces (@IDF) March 18, 2026
తాజావార్తలు
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!