కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయనుంది ఎన్టీవీ.. అసలు.. కాంగ్రెస్ ఏడాది పాలనకు కేటీఆర్ ఎన్ని మార్కులేస్తారు..? ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగా.. అప్పుడే బీఆర్ఎస్కి తొందర ఎందుకు?.. అసలు పవర్ లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారా?.. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైపోతుందా?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే లగచర్ల దాడి ప్లాన్ చేశారా?.. కేసీఆర్ అసెంబ్లీని ఎందుకు తప్పించుకుంటున్నారా?..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ఉండవల్లి.. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి పవన్ కల్యాణ్ శ్రద్ధ తీసుకోవాలని లేఖలో కోరారు..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం.. రేపటికి తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమపై రెండు రోజులు ఉంటుందని చెబుతున్నారు..
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం.. శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు నూతన ఈవో ఎం.శ్రీనివాసరావు.. అయితే, శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలివేస్తూ గతంలో దేవస్థానం ప్రకటించిన విషయం విదితమే కాగా.. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు ఈవో శ్రీనివాసరావు.
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఇక చకచకా సాగనున్నాయి.. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు..
రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్.కృష్ణయ్య.. అయితే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పార్టీలో ఉన్నా.. తాను బీసీల సంక్షేమం కోసం పని చేస్తాను అని స్పష్టం చేశారు.. అయితే, ఈను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్నే పిలిచి సీటిచ్చారని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో సంచలనం రేపిన జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.. మాజీ ఎంపీ వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది హనీ ట్రాప్ కేసు.. మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు బాధితులు.. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కామెంట్స్ పై బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
బట్టలు ఆరేస్తుండగా జరిగిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. ఒకేసారి ఏకంగా ముగ్గురు మృతి చెందారు.. తల్లి, ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది..
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారినపడింది. వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత.. చిరు వ్యాపారి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తనకూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున కూతురు తెలిసో.. తెలియకో.. అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణి ఓ లింక్ ను ఓకే చేసింది.