పిఠాపురంలో క్రైమ్ పెరిగిందంటూ గత వారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆస్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడను అని స్పష్టం చేశారు.. అటువంటిది ఉంటే అడ్రస్ చేస్తామని వెల్లడించారు..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎంను కలవడం ఆనవాయితీగానే వస్తోందన్నారు పురంధేశ్వరి.. ఇద్దరి మధ్యా పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయి.. రాజకీయ అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది... రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చకు రావచ్చు.. అమిత్ షా, సీఎం కలయికలో వచ్చే అంశాలపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు..
నంద్యాల విజయ డైరీలో ఖాళీగా ఉన్న ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలను తాత్కాలికంగా రద్దు చేశారు.. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఆళ్గడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచరులు భారీ సంఖ్యలో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో, పోలీసుల సలహా మేరకు నామినేషన్ ప్రక్రియ వాయిదా వేసినట్లు ప్రకటించారు నంద్యాల విజయ డైరీ ఎండీ ప్రదీప్..
ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని గర్వంగా చెప్పుకునే విశాఖ ఉక్కు మనుగడ మీద ముసురుకున్న గాఢ మేఘాలు తొలిగిపోయాయి. ఎన్నికల హామీకి అనుగుణంగానే NDA ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మనుగడను కాపాడే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. RINLకు 11500కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో గత నాలుగేళ్ళుగా కార్మిక సంఘాలు సాగిస్తున్న పోరాటం.. రాజకీయ ఒత్తిళ్ళకు ఫలితం లభించినట్టైంది.
సంక్రాంతి పండుగ రోజుల్లో నందిగామ నియోజకవర్గంలో జరిగిన ఓ మహిళ హత్య స్థానికంగా కలకలం రేపింది. నందిగామ నియోజకవర్గం ఐతవరంలో నాగేంద్రమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ నెల 15న నాగేంద్రమ్మ ఇంట్లో హత్య జరిగింది.. దీనిపై పోలీసులకు సమాచారం అందటంతో విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలుగుదేశం పార్టీ పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే... ఎస్.. వాతావరణం చూస్తుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నాయి హైకమాండ్‌కు అత్యంత సన్నిహిత వర్గాలు. అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీని మీద సీరియస్‌గా వర్కౌట్ చేస్తున్నట్టు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. వారి ఆధ్వర్యంలో అభివృద్ధికి అవకాశం ఉందన్నారు టీజీ వెంకటేష్..
అప్పుడెప్పుడో ఇంద్ర సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ చిరంజీవి ఇప్పుడు వేస్తున్న పొలిటికల్ స్టెప్స్‌కు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాశీకి వెళ్ళకున్నా... కాషాయం కప్పుకోవడం మాత్రం దాదాపు ఖాయమని అంటున్నారు. కాకుంటే... ఇది రాజకీయ కాషాయం. ఇక వారణాసిలో బతకకున్నా... తన రాజకీయ వరస మాత్రం మార్చుకోబోతున్నారట.