Big Twists in Pastor Praveen Case: అనుమానస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందటానికి ముందు బెజవాడలో ఉన్న 3 గంటలు ఏం చేశారనే దానిపై మిస్టరీ వీడింది. ఈ నెల 24న ప్రవీణ్ బెజవాడ మీదుగా రాజమండ్రి వెళ్తూ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో బెజవాడ నగరంలో ఉన్న 200 సీసీ టీవీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు ప్రవీణ్.. విజయవాడ నగరంలో ఏం చేశాడనే విషయాన్ని గుర్తించి నివేదికను పోలీస్ కమిషనర్ (సీపీ)కి అందజేశారు పోలీసులు..
Read Also: Bank Holidays: ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల బ్యాంకుల సెలువు లిస్ట్ ఇదే!
విజయవాడ నగరంలో పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయల్దేరుతూ గుంటుపల్లి నుంచి భవానీపురం వచ్చే మార్గంలో ఒకసారి బైకుపై నుంచి పడిపోయారు. ఈ సమయంలోనే ఆయన బుల్లెట్ హెడ్ లైట్ కూడా ధ్వంసమైంది.. ఆ తర్వాత భవానీపురంలో పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టుంచుకుని నగరంలో దుర్గగుడి ఫ్లై ఓవర్ మీదుగా బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పై ప్రయాణించి రామవరప్పాడు రింగు సెంటర్‌కు చేరుకున్నారు. రామవరప్పాడు రింగు సెంటర్‌కు చేరుకున్న తర్వాత అస్వస్థతకు గురైన పాస్టర్ ప్రవీణ్ అక్కడే ఉన్న గ్రీనరీ పార్క్ లో కూర్చున్నారు. 5.15 నుంచి 7.30 వరకు అక్కడే ఉన్న ఆయనను స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు వెళ్లి మంచినీరు అందించారు. పక్కనే ఉన్న టీస్టాల్ కు వెళ్లిన పాస్టర్ ప్రవీణ్ టీ తాగారు.
ఇక, పాస్టర్ టీ తాగటానికి ముందు మొహం కడుక్కున్నారని టీస్టాల్ కార్మికుడు నాగార్జున తెలిపారు. ఇదే సమయంలో ప్రవీణ్ బుల్లెట్ హెడ్‌లైట్ ఊడిపోయి ఉండటంతో నాగార్జున తన హోటల్ లో ఉన్న తాడు తీసుకువచ్చి బిగించాడు. అయినప్పటికీ హెడ్ లైట్ ఊడిపోవటంతో వైరు వంటి దానితో కట్టడానికి నాగార్జున హోటల్‌లోకి, ఎస్ ఐ సుబ్బరావు తన జీపు వద్దకు వెళ్లారు.. అయితే, తిరిగి వచ్చే సమయానికి పాస్టర్ ప్రవీణ్ అక్కడ నుంచి బుల్లెట్‌తో సహా వెళ్లిపోయారు. నీరసంగా ఉన్నారని కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్లాలని సూచించినా కూడా ప్రవీణ్ వినకుండా వెళ్ళిపోయాని నాగార్జున తెలిపారు. సుమారు 35 నిమిషాలపాటు పాస్టర్ ప్రవీణ్ రామవరప్పాడు రింగు సెంటరులో ఉన్నట్టు గుర్తించారు. మొత్తం సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు.