అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సంక్రాంతి సందర్భంగా సీఆర్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువకుల మధ్య మాట మాట వచ్చి చిన్న వివాదం చోటు చేసుకుంది.. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసింది..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది. మళ్లీ రైల్వే లైన్ పనులు పట్టాలు ఎక్కాయి. భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైల్వే అధికారులను ఆదేశాలు ఇవ్వడంతో పనులు పునరుద్ధరించారు.
సాయంత్రం టీడీపీ మంత్రులతో ప్రత్యేకంగా భేటీకానున్నారు.. నామినేటెడ్ పదవులు.. టీడీపీ సభ్యత్వానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.. ఇక, ఎంపీలు, జోనల్ ఇంఛార్జీలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండాను సిద్ధం చేశారు అధికారులు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతోంది కేబినెట్.. ఇక, మహిళలకు, గీత కులవృత్తిదారులకు గుడ్న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ఈ నెల 18వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. ఏపీకి రాబోతున్నారు.. ఆదివారం రోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్షా రానున్నారు రాష్ట్ర బీజేపీ ప్రకటించింది.. ఈ పర్యటనలో భాగంగా 19వ తేదీన కృష్ణా జిల్లా, గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారని తెలిపారు.
పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. మా వాళ్లపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంచు మనోజ్.. నిన్న మోహన్బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన ఘటనలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. తన భార్య మౌనికతో కలిసి పీఎస్కు వచ్చిన మనోజ్.. తన అనుచరులు పళణి, వినాయకతో ఎంబీయూ సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్ పై ఫిర్యాదు చేయించారు..
మంచు మనోజ్, మౌనిక దంపతులు చంద్రగిరి పోలీసుస్టేషన్ చేరుకుని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఘటనపై రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనపై, మౌనికపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని అందులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని మంచు మనోజ్కు సూచించారు పోలీసులు.