ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు మార్లు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగగా.. ఈ రోజు 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు..
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన ప్రారంభించారు.. ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు (ఉల్లిపాయ వాడకుండా) చేసిన మసాలా వడలు వడ్డించారు టీటీడీ సిబ్బంది..
పాదయాత్రలో రెడ్ బుక్ గురించి నేను మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు అన్నారు మంత్రి నారా లోకేష్.. జ్యూరిక్లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిలవగానే ఇంత మంది వస్తారని తాను ఊహించలేదు.. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే.. జ్యూరిక్‌లో ఉన్నామా..? లేక జువ్వలపాలెంలో ఉన్నామా అర్థం కావడం లేదంటూ చమత్కరించారు.
ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని వ్యాఖ్యానించారు మంత్రి టీజీ భరత్.. జ్యూరిక్లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు..
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపడంతో పాటు కేంద్రం 11,500 కోట్ల రూపాయల సహాయం అందించిందని, ఒక్కరోజు విశాఖపట్నం పర్యటనలో ప్రధాన నరేంద్ర మోడీ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రెండు లక్షల కోట్ల నిధులు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించడమే అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.. గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు.. ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు ఇవ్వనున్నారు.. గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు ఉంటుందని.. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని.. అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంత కాలంగా.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ కాకరేపుతోంది.. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం.. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం చేసింది..