AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారికి గుడ్‌న్యూస్..
- పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..
- 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ..
- బార్ లైసెన్స్‌ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. 9 అంశాలపై చర్చించారు.. ఇక, బార్ లైసెన్స్‌ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.. యువజన, పర్యాటక శాఖలో జీవోల ర్యాటిఫికేషన్‌కు మంత్రవర్గం ఆమోదం తెలిపింది.. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు – 2025కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ రూపకల్పన చేయనున్నారు.. ఇక, రూ.710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు..
Read Also: Siddu – Bhaskar: సిద్దు – భాస్కర్ మధ్య గొడవపై క్లారిటీ
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారధి.. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పన పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఊహాజనిత హామీలు లేకుండా ముందుకు వెళ్తున్నాం. ఆర్స్ లి మిట్టల్ నిస్సార్ ఇండియా లిమిటెడ్.. స్టీల్ ఉత్పత్తికి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. క్యాపిటివ్ పోర్ట్ కావాలని నిస్సార్ ఇండియా లిమిటెడ్ కోరింది.. స్టీల్ ప్లాంట్ వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టే అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.. టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. త్రి స్టార్ హోటళ్లలో రూమ్ లు పెరగాలి.. టూరిజం శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. బార్ లైసెన్స్ లు 25 లక్షలకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు..
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం
పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కు సంబంధించి జల హారతి కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందన్నారు మంత్రి పార్థసారథి.. సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. ప్రతి ఏడాది వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల నీరు వృధాగా పోతోంది.. రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు జరుగుతోంది. అధికారులు పల్లెల్లో ఉండి పరిస్థితి.. సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు.. అధికారుల నివేదిక తర్వాత గ్రామీణాభివృద్ధికి ఏమి చేయాలి అనే అంశం పై ప్రభుత్వం దృష్టి పెట్టనుందన్నారు.. అన్ని మత విశ్వాసాలు గౌరవించడం ప్రభుత్వ లక్ష్యం. వక్ఫ్ బిల్లు లపై మార్పులకు సంబంధించి ఇప్పటికే టీడీపీ సూచించిందని గుర్తుచేశారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!