Deputy CM Pawan Kalyan: తిరుపతి – పళని బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. భక్తుల అవసరాలను అర్ధం చేసుకున్నాను.. అందుకే తిరుపతి-పళని బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నాం అన్నారు.. మంగళగిరి జనసేన కార్యాలయంలో తిరుపతి – పళని బస్సు సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాగా.. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమలరావు పాల్గొనప్నారు.. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వేద ఆశీర్వచనం చేశారు వేద పండితులు..
Read Also: Ponnam Prabhakar: హైదరాబాద్ లో భారీ వర్షాలు.. జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మురుగన్ ఆలయాల సందర్శనలో భాగంగా పళని ఆలయానికి వెళ్లినప్పుడు కొందరు భక్తులు తిరుపతి బస్సు కావాలని విజ్ఞప్తి చేశారు.. భక్తుల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగానే ఆమోదించారు.. తిరుపతి – పళని బస్సు సర్వీస్ ప్రారంభించటం ఆనందకరంగా ఉందన్నారు.. మురుగన్ భక్తుల కోరిక బలీయంగా ఉంది కాబట్టే అనుకున్న అర గంటలోనే శాంక్షన్ వచ్చింది.. ఇది భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది.. ఎంతో కాలంగా పళని వాసులు తిరుపతి బస్సు సర్వీస్ కోసం ఎదురు చూశారు.. ఫిబ్రవరిలో నేను వెళ్లిన సమయంలో భక్తుల అవసరాలను అర్ధం చేసుకుని బస్సు ఏర్పాటు చేశాం అన్నారు.. కొత్త సర్వీస్ తో ప్రయాణ సమయం తగ్గుతుంది.. ఈ బస్సుతో సమీప ఆలయాలు కూడా సందర్శించవచ్చు.. ఈ బస్సు వల్ల రెండు ప్రాంతాల భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.. బస్సు సర్వీస్ కు తోడ్పడిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్..