పంచగ్రామాల ప్రజలకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.. పంచగ్రామాల ప్రజలకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు.. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు.. పంచ గ్రామల సమస్య ఉన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులుతో పంచగ్రామాల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోర్టులలో ఉన్న వివాదాలను విత్ డ్రా చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయన్నారు గంటా శ్రీనివాసరావు.
అటవీశాఖ ఉన్నతాధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు .. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్ర విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.. అసలు, పెద్దిరెడ్డి కుటుంబం.. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించింది.. అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు
ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు కొనసాగిస్తోంది.. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరు వెళ్ళి వచ్చింది.. అక్కడ ఆ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసింది.. ముఖ్యమంత్రి, ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమస్యలపై కూడా దృష్టిపెట్టారు.. అలాగే అధికారులు సైతం తెలంగాణ, కర్ణాటక వెళ్ళి వచ్చారు... ఇద్దరి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది.. వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది..
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కాస్తా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. తనపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముంటే వార్తలు రాయాలని సవాల్ విసిరిన జయరాం.. ఎవడో డబ్బులు ఇస్తాడని.. అమ్ముడుపోయి రాతలు రాస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు..
మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుండి విడుదలయ్యారు... పలు కేసుల్లో, 145 రోజులుగా జైలులో ఉంటున్న నందిగం సురేష్ కు వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు ఉదయం జైలు నుండి విడుదలయ్యారు... పదివేల రూపాయల పూచికత్తు సమర్పించిన నందిగం సురేష్ ని జైలు అధికారులు విడుదల చేశారు.
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల తహసీల్దారు శ్రావణికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగింది. కార్యాలయంలో మంగళవారం విధులు నిర్వర్తిస్తుండగా ఆమె మొబైల్ ఫోన్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడున్నారు.? ఏమి చేస్తున్నారు..? విధుల్లో ఉన్నారా..? మేము కార్యాలయం వద్దకు వస్తున్నాం.. బయటకు రండి అంటూ బెదిరించేలా మాట్లాడారు గుర్తుతెలియని వ్యక్తులు.