Nara Lokesh: మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్.. మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం.. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాని భావోద్వేగానికి గురయ్యారు. ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసించి మార్కుల్లో రాష్ట్రస్థాయి టాపర్ లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను “షైనింగ్ స్టార్స్-2025” పేరుతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించి సన్మానించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన “షైనింగ్ స్టార్స్-2025” కార్యక్రమంలో విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించి ల్యాప్ ట్యాప్ లను బహూకరించారు.
Read Also: IND vs BAN: బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
ఇక, ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థుల విజయాన్ని సెలబ్రేటే చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాం.. పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. జూనియర్ కాలేజీల విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారు. పాయకాపురంలో ఓ చెల్లితో మాట్లాడినప్పుడు.. తల్లిదండ్రులను కోల్పోయిన తనను చేపలమ్మి వాళ్ల అమ్మమ్మ చదివిస్తోందని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించడం వల్ల ఆమెపై భారం తగ్గిందని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
Read Also: Bhatti Vikramarka : మాతో కలిసి నడవండి.. బహుజన శక్తిని చాటి చెప్పండి
ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను మీరు చెరిపివేశారంటూ అభినందించారు మంత్రి లోకేష్.. మీరందరూ విజేతలు. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు. ఇవాళ మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్. విద్యార్థుల మధ్య పోటీ ఉండాలి. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆడుతూ, పాడుతూ ఉండేవాడిని. క్రికెట్ ఆడేవాడిని. పదో తరగతికి వచ్చిన తర్వాత నన్ను బాగా రుద్దారు. నేను కూడా రుద్దుడు బ్యాచ్ నే. తర్వాత ఇంటర్ రెండేళ్లు బాగా కష్టపడ్డాను. మూడేళ్ల పాటు చాలా కీలక సమయం. తర్వాత స్టాన్ ఫోర్డ్ లో ఎంబీఏ చేశాను. వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. టెక్ట్స్, నోట్ పుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాం. ప్రిన్సిపల్స్ కు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇలా అనేకం చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. విద్యాశాఖలో జూన్ నాటికి సంస్కరణలు పూర్తిచేసి అనంతరం లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృషి పెడతామని పేర్కొన్నారు..
Read Also: Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు.. సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట్..?
మిమ్మల్ని చూసి చాలామంది ఇన్ స్పైర్ కావాలన్నారు లోకేష్… టాప్ మార్కులు సాధించిన వారిలో బాలికలు ఎక్కువమంది ఉన్నారు. వ్యాపారంలో కూడా మహిళలు చాలా బాగా రాణిస్తారు. చదువు, వ్యాపారంలో నాకంటే బ్రాహ్మణి చాలా బెటర్. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలి. అన్నివిధాల ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు విదేశీ విద్యకు ప్రత్నామ్నాయం తీసుకువస్తాం. నేను స్టాన్ ఫోర్డ్ లో ఎంబీఏ చదివేందుకు వెళ్లినప్పుడు మీ వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని అడగలేదు. ఇంటర్వూ తర్వాత కావాల్సిన వారికి లోన్, ఇంటర్నషిప్ అందిస్తారన్నారు.. అయితే, డబ్బులు లేవని పిల్లలు ఇబ్బందిపడకూడదనేది మా లక్ష్యం. మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాల వల్లే. ఇది మర్చిపోకూడదు. కఠిన సవాళ్లు ఎదురైనా ఎదుర్కోవాలి. 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని నేను ఎంచుకుని పోటీ చేశా. అనేక ఇబ్బందులు ఎదుర్కొని విజయం సాధించాను. స్ట్రగుల్ ఉన్నప్పుడే గెలుస్తారు. కష్టమైనా ఏరికోరి విద్యాశాఖను ఎంచుకున్నా. టార్గెట్ పెట్టి మరీ సీఎం చంద్రబాబు నాకు ఈ శాఖను అప్పగించారు. ఇంటర్ తర్వాత కూడా ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి. అందరూ ఐటీ వైపే వెళ్లానుకోవడం కరెక్ట్ కాదు. ఇవాళ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి క్లియర్ అయింది. నెల్లూరు, అనకాపల్లి సోలార్ ఎనర్జీ ప్లాంట్ లు వస్తున్నాయి. కనిగిరిలో రిలయన్స్ కంప్రెస్ట్ బయో గ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటుచేసింది. కొత్త సెక్టార్స్ వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా రంగాలను ఎంచుకోవాలని సూచించారు.
Read Also: Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు.. సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట్..?
జీవితం అనేది జర్నీ.. నాట్ డెస్టినేషన్.. ఈ మధ్య కాలంలో విద్యార్థులు బాగా సున్నితంగా ఉంటున్నారన్నారు లోకేష్. ఇంటర్ ఫలితాలు ఎలా విడుదల చేయాలనేది మేం రెండు గంటల పాటు చర్చించాం. లక్ష్యం కోసం పనిచేయాలి. చిన్నచిన్న ఆటుపోట్లు ఎదురైనా తట్టుకోవాలి. మీకు అన్ని విధాల సహకారం అందిస్తాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తాం. కలల సాధనకు కష్టపడాలి. ప్రోత్సహించే బాధ్యత నాది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో వసతులను మెగురుపరుస్తాం. ఇంటర్మీడియట్ లో యూనిఫాం అందిస్తే బాగుంటుందని చాలా మంది విద్యార్థులు కోరారు. మీ ఫీడ్ బ్యాక్ ను సీరియస్ గా తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. సమస్యలు ఏవైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఇంటర్ తర్వాత కాలేజీలకు వెళ్తారు. ఫ్రీడమ్ ను దుర్వినియోగం చేసుకోవద్దు. కాలేజీల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ను చేపట్టాం. చాలా సీరియస్ గా తీసుకున్నాం అన్నారు. జీవితాంతం కుటుంబానికి అండగా ఉండాలి. నేను కూడా పనిఒత్తిడిలో మా అమ్మగారితో, దేవాన్ష్ తో మాట్లాడాలనే విషయం మిస్ అవుతున్నా. ఎదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించాలి. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతల గురించి కూడా మాట్లాడాలి. స్వచ్ఛతలో మంగళగిరిని నెం.1గా మార్చే క్రమంలో వెయ్యి టన్నుల చెత్త బయటపడింది. మన పరిసరాలను చెత్త రహితంగా ఉంచుకోవాలి. మీరంతా జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ కావాలన్నారు. మీరంతా విజేతలు. మీకు హ్యాట్సాఫ్..! మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారు.. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను అని అభినందించారు మంత్రి నారా లోకేష్.