చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఏర్పాటు చేసిన అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ విచారణ ప్రారంభించింది.. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి ఆక్రమించారని భావిస్తున్న 295, 296 సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాలను పరిశీలించారు.
తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు. ఏడు నెలలుగా డీజీపీగా పని చేస్తున్నాను.. 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి ఉంది.. సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు..
తాను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్.. "మన మిత్ర" పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు.
ఏపీ ప్రభుత్వం దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. దీని ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందించనుంది.. ఒకేముందు.. 95523 00009ను సేవ్ చేసుకోండి.. మీకు కావాల్సిన సేవను అందుకోండి..
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. కొన్ని సార్లు ఓ అసత్యం కూడా.. సత్యంగా ప్రచారంలోకి వస్తుంది.. అలాంటి పరిస్థిత ఏలూరు జిల్లాలో వచ్చింది.. పిల్లి పిల్లలను చూసి.. అవి పులి పిల్లలు అని భావించిన స్థానికికులు భయాందోళనకు గురయ్యారు.. ఆ తర్వాత నిజం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం జరగనుంది.. 15 ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనుంది SLPB.. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది సమావేశం.. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు కల్పన టార్గెట్గా ప్రభుత్వం ప్రణాళికలు పెట్టుకుంది.
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు.. వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్న కేంద్రమంత్రి.. దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్ విసిరారు.. కేంద్ర మంత్రి చెప్పే, పిట్టకథలు, పిల్ల కథలు గుంటూరు ప్రజలకు చెబితే నమ్మరని, టీడీపీ నేతలకు దిమాక్ ఎంత ఉందో త్వరలోనే చూస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా.. ఉద్దేశ్య పూర్వకంగా రాసినా చెల్లుతుందనే ఉద్దేశంతో విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.