ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ ఎగ్జామ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్లో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.
ఆంధ్రా ఊటీ అరకువ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధం అయింది. ఉర్రూతలూగించే అడ్వెంచర్స్, హెలీ రైడ్స్ ఒక పక్క.. గిరిజన సాంప్రదాయ కార్నివాల్ మరోపక్క.. ఎటు చూసిన ధూమ్ ధామ్ వాతావరణమే కనిపించనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి..
గుజరాత్ రాష్ట్రంలో గ్యాస్ సిలండర్ పేలిన ఘటనలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మృతిచెందారు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు చెందిన వలస కూలీలు గుజరాత్ రాష్ట్రం ముంద్రాలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు విడిచారు..
ప్రజలకు మరింత చేరవగా సేవలు అందించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదికలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి వలసలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. వైసీపీ ఖాళీ అవుతోందన్న ఆయన.. పార్టీలో నంబర్ 2గా ఉన్న వ్యక్తులు కూడా వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ వచ్చేసింది.. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు..