Balabhadrapuram Cancer Cases: క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో మరోసారి వైద్య ఆరోగ్యశాఖ సమగ్ర సర్వే జరుపుతున్నారు. ఐదు బృందాలు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టాయి. బలభద్రపురం గ్రామంలోని పదివేల మందికి పైగా జనాభా ఉన్నారు.. ఇంటింటికి తిరిగి బృందం ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను అడిగి తెలుసుకొంటున్నారు. రెండు నెలల పాటు గ్రామమంతా ఈ సర్వే కొనసాగుతుంది. క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఒక నివేదికను తయారు చేయనున్నారు. అలాగే క్యాన్సర్ అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. క్యాన్సర్ అంటే భయపడి కొందరు ఆరోగ్యానికి సంబంధించి పూర్తి సమాచారం. ఇవ్వడం లేదని అపోహలు ఉన్నాయి. ఇటువంటి అపాహలకు తావు లేకుండా ఉండేలా సమగ్ర సర్వే జరుపుతున్నారు. రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ.ఎన్.ఎం.లు , వైద్య బృందాలు గ్రామంలో ఇంటింటికి తిరిగి సమగ్ర సర్వే చేస్తున్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ కి సంబంధించి పలు రకాలైన లక్షణాలు మీలో ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. క్యాన్సర్ పై ప్రజలకు ఉన్న అపోహలను నివృత్తి చేస్తున్నారు.
గత నెల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలోని బలభద్రపురం గ్రామంలో అత్యధికంగా క్యాన్సర్ కేసులు ఉన్నాయని, వీటి నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. దీనితో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పెద్ద ఎత్తున సర్వే నిర్వహించారు. 29 మంది అనుమానితులను గుర్తించి వైద్య పరీక్షలు చేయించారు. సర్వేలో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భరోసా ఇచ్చారు. తర్వాత కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల బృందం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సుమారు 1500 మందికి వైద్య పరీక్షలు చేసి 62 మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యత్యాసం ఏమిటి అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైద్యాధికారులను ప్రశ్నించారు. సర్వేకు సంబంధించి.. తప్పుడు రిపోర్టులు ఇవ్వవద్దని వైద్యాలయం శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ అధికారులు బలభద్రపురం గ్రామంలో మళ్లీ.. మరోసారి సమగ్ర సర్వే చేపట్టింది. ప్రస్తుతం సమగ్ర సర్వే గ్రామంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. ఎక్కువగా ప్రజలు సదరు బిపి వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నామని అక్కడక్కడ సర్వేలో చెప్తున్నారు.
Read Also: Kotha Prabhakar Reddy : కాంగ్రెస్‌ను మేము కూల్చబోము.. కానీ మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం
అసలు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు ఎందుకు వస్తున్నాయి మూల కారణం ఏమిటి అనే విషయాలపై పెద్దగా చర్యలు లేవు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గత నెల బలభద్రపురంలోని 26 టిన్నులతో. మంచినీటి నమూనాలను సేకరించారు వీటికి సంబంధించి రిపోర్టు ఇంతవరకు రాలేదు. ప్రాథమిక సమాచారం మేరకు గ్రామంలో రెండు బోర్లు మినహా మిగిలిన అన్ని బోర్లుల్లోనూ ఎటువంటి లోపాలు లేనట్లు నిర్ధారించారు. దీనిపై అధికారికంగా రిపోర్టు అందవలసి ఉంది. గ్రామంలో ప్రజలకు అవసరమైన స్వచ్ఛమైన త్రాగునీటినందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు బలభద్రపురం పంచాయతీ కార్యదర్శి అంటున్నారు. 45 వేల లీటర్ల సామర్థ్యంతో మరో కొత్త వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సలహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. గ్రామంలో మరణాల సంఖ్య గతం కంటే ప్రతి ఏటా తగ్గుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2021లో 105 వరకు నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.. 2022లో 77 కేసులు, 2003లో 78 మరణాలు , 2004లో 75, 2025 లో ఎప్పటి వరకు 30 మరణాలు సంభవించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం బలభద్రపురంలో సాధారణ వాతావరణమే కనిపిస్తుంది. గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..