ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదని, అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్ పడింది.. మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గత రెండు రోజులుగా రద్దీగా ఉన్నాయి.. అయితే, రేపు అమావాస్య కావడంతో దాని ప్రభావం ఇవాళ, రేపు రెండు రోజులు పడింది.. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.. ఈ నెలాఖరు చివరి రెండు రోజులుగా ఉన్న 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది..
లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సాగుతున్న చర్చపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వస్తున్న వాదనాలపై బుచ్చయ్య చౌదరి స్పందించారు.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరోకరికి ఆలోచన లేదన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉన్నారని అన్నారు..
చంద్రబాబు కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. సీఐడీ నమోదు చేసిన ఏడు కేసులు.. సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య.. అయితే, బాలయ్య తరపు వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్.. దీంతో.. మణీందర్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ బేలా త్రివేది.
టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు.. టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం రావటం జరిగింది. మొదటి ప్రయారిటీ గంజాయిని అరికట్టాం.. ఏజెన్సీలో ఎక్కువ గంజాయి ఉండటంతో […]
గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఎల్టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్ రెడ్డి.. గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖరాయడంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు.
తాను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. పార్టీ విజయాల బాటలో ఉన్నప్పుడు అన్ని సక్రమంగానే కనపడతాయని, ఓటమి ఎదురైనప్పుడే నాయకులు పోరాటం చేయాలని సూచించారు.. విజయసాయిరెడ్డి ఒత్తిళ్లకు భయపడే వ్యక్తి కాదని, రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారన్నది ఆయన వ్యక్తిగతమన్నారు.
చంద్రబాబు అబద్దాల మాటలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు భూమన కరుణాకర్‌రెడ్డి.. అంతేకాదు.. అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు..? అని ఎద్దేవా చేశారు..
టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.