KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పలు సందర్భాల్లో తెలంగాణ అభివృద్ధిపై.. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి, సైబరాబాద్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చాలా వేదికల్లోనూ ప్రశంసలు కురిపించారు.. తాజాగా, దావోస్ పర్యటనలో ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలో పాల్గొన్న కార్యక్రమంలోనూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా ఉందంటూ చంద్రబాబు కీర్తించారు.. ఇక, సోమవారం మీడియా సమావేశంలోనూ మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో […]
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో సోమవారం రాత్రి ఓ వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు.
వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు 872.07 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ ను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు బదలాయించనున్నారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
వైజాగ్ వచ్చే పర్యాటకులు బీచ్లో కూర్చుని టీ తాగడానికి రారు.. వాళ్లకు కావాల్సింది ఎంజాయ్మెంట్ అన్నారు అయ్యన్నపాత్రుడు.. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారన్న ఆయన.. ఎంజాయ్ చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఉండాలన్నారు. టూరిజంకు మినహాయింపులు ఇవ్వాలని పేర్కొన్నారు.. రూల్స్ అవసరమే.. కానీ, కొంత వెసులు బాటు వుండాలన్నారు.. గిరిజన ప్రాంతాలలో పెట్టుబడి పెట్టేందుకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలి.. ఆఫీసియల్స్ పాజిటివ్ మైండ్తో వుండాలన్నారు.
ప్రజలే ఫస్ట్... అనే నినాదంతో అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఆధారంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు..
మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈసారి, ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవులు భర్తీ చేయనున్నారు.. రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్.. డైరెక్టర్ల పదవులపై కసరత్తు చేస్తున్నారు.. దేవాలయాల పాలక మండళ్లపై కూడా దృష్టిసారించింది ప్రభుత్వం. ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటుపై.. జిల్లా నియోజకవర్గ స్థాయిలో పదవుల భర్తీపై దృష్టి…
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీమ్ దావోస్ పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ఓ కేసులో కోర్టులో హాజరుఅయ్యేందుకు విశాఖ వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడు నెలలలో ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు..