Minister Narayana: రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై వ్వరికీ భయాందోళనలు అవసరం లేదన్నారు మంత్రి నారాయణ.. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. అమరావతి రాజధాని రీ లాంచ్ కార్యక్రమనికి వచ్చే నెల 2న ప్రధాని మోడీ వస్తున్నారని తెలిపారు.. వేదిక ఏర్పాట్లు ఇవాళ పరిశీలించాం.. రోడ్ల పనులు.. పార్కింగ్ పనులు కూడా త్వరలో పూర్తి అవుతాయన్నారు.. అవసరం అయితే పార్కింగ్ స్థలాలను పెంచాలని సీఎం సూచించారు. కేవలం 58 రోజులల్లో.. లిటిగేషన్ లేకుండా రైతులు భూములు ఇచ్చారు.. సభ జరిగే ప్రాంగణంలో మూడు వేదికలు ఉంటాయి.. ఒక వేదిక పై రైతులు కూర్చుంటారు.. సీఎం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారని తెలిపారు.
Read Also: Pahalgam Terror Attack: ప్రొఫెసర్ ప్రాణాలు కాపాడిన ‘కల్మా’ శ్లోకం
అయితే, రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై ఎవ్వరికీ భయాందోళనలు అవసరం లేదన్నారు నారాయణ.. వాణిజ్య వ్యాపార లావాదేవీలు జరగాలంటే భూమి అవసరం.. పెద్ద పెద్ద కంపెనీలు.. పరిశ్రమలు రావాలి.. అందుకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో రావాలి.. ఇందుకోసం అదనపు భూమి అవసరం.. కానీ, భూ సేకరణ చేస్తే రైతులకు నష్టం జరుగుతుందన్నారు.. మరోవైపు.. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని 2014లోనే అనుకున్నాం.. గుజరాత్ లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించామని తెలిపారు.. సీఎం చంద్రబాబుతో మాట్లాడి.. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం డిజైన్ ఎలా ఉండాలి అనేది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి నారాయణ.. కాగా, నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా గుజరాత్ పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అమరావతిలో కూడా ఇదే విధమైన విగ్రహాల ఏర్పాటు కోసం అధ్యయనం చేస్తున్నామని ప్రకటించారు. కాగా, డీపీఆర్ వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ విగ్రహం ఎత్తుపై పూర్తి స్పష్టత రానుంది. ప్రాథమిక అంచనాల మేరకు 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.