Off The Record: తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులుగా బొడ్డు వెంకట రమణ చౌదరి నియామకం వివాదస్పాదంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వలసదారుడిగా టిడిపిలో చేరిన ఆయనకు ఈ పదవి కట్టపెట్టడంపై పార్టీలో నిరుత్సాహం నెలకొందట. ప్రస్తుతం రుడా చైర్మన్‌గా, రాజానగరం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జిగా కొనసాగుతున్నారు బొడ్డు వెంకటరమణ చౌదరి. మళ్లీ టిడిపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై పార్టీ కార్యకర్తలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. […]
Vangaveeti Asha Kiran: దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై వంగవీటి ఆశా కిరణ్ తీవ్ర స్వరంతో స్పందించారు. విశాఖపట్నం వేదికగా మన రంగానాడు పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె వైసీపీ, జనసేన, టీడీపీలను నేరుగా ప్రశ్నిస్తూ.. “37 ఏళ్లుగా మీరు రంగా కోసం ఏం చేశారు..?” అంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో రంగా ఫోటోను ప్రచారానికి వాడుకుంటూ ఓట్లు అడుగుతున్న పార్టీలు, ఆ తర్వాత ఆయన పేరును, ఆయన […]
Minister Atchannaidu: ప్రజలు తమ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకపై ఉండదని.. ముఖ్యంగా 22ఏ భూ సమస్యల నుంచి రైతులకు, సామాన్యులకు విముక్తి కలిగించి, వారి భూమిపై వారికి పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీ చేతికి మీ భూమి – 22ఏ భూ స్వేచ్ఛ’ ప్రత్యేక గ్రీవెన్స్ […]
Guntur: గుంటూరు జిల్లా మందడంలో విషాదం నెలకొంది.. రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో తన గోడు వెళ్లబోసుకున్న బాధితుడు రామారావు… తన అభిప్రాయం చెప్పి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. మీకు మా స్థలాలు ఇచ్చి బొచ్చెలు పట్టుకుని అడుక్కోవాల్సి వస్తోందంటూ బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.. మంత్రితో మాట్లాడుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు వృద్ధుడు రామారావు.. అక్కడున్నవారు వెంటనే స్పందించి CPR చేశారు.. హుటాహుటిన మంత్రి నారాయణ […]
TTD Parakamani Theft Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో సీఐడీకి కీలక సూచనలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సీఐడీ విచారణ నివేదిక అందినట్టు పేర్కొన్న ఏపీ హైకోర్టు.. ఈ కేసులో సీఐడీ ఇంకా కొన్ని అంశాలపై విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది.. కేసులో వేర్వేరు అంశాలు ఉన్న కారణంగా.. విడిగా FIR నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం.. ఆ అంశాన్ని పరిశీలించాలని […]
Cancer Research: మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిలవచేసిన ఫుడ్, ఫ్యాకింగ్ ఫుడ్.. ఇలా ఎన్నో క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి.. అయితే, క్యాన్సర్ సోకితే ఇక అంతే అనుకునే పరిస్థితి నుంచి.. క్యాన్సర్‌కు చెక్ పెట్టే స్థాయి వరకు కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు.. ఇప్పటికే కొన్ని చికిత్సలు, మందుల లాంటివి కొన్ని దేశాల్లో అందుబాటులోకి రాగా.. ఇప్పుడు.. శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. జపనీస్ చెట్టు కప్ప (డ్రైఫైట్స్ జపోనికస్) ప్రేగులలో కనిపించే బాక్టీరియా […]
New Year’s Day 2026: కాలం వేగంగా పరిగెత్తుతుంది.. నెలలు, సంవత్సరాలు.. ఇలా మారుతూనే ఉన్నాయి.. అయితే, నూతన సంవత్సరం అంటే కేవలం తేదీ మార్పు కాదు.. ఇది కొత్త ప్రారంభాలు, కొత్త ఆలోచనలు.. సానుకూల మార్పులకు సమయంగా తీసుకోవాలి.. ఓ టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగాలి.. ఇది సాధిస్తాను అనే గోల్ పెట్టుకోవాలి.. ఓ మార్పునకు శ్రీకారం చుట్టాలని అని పెద్దలు చెబుతారు.. ఇక, మతపరమైన మరియు జ్యోతిష్యశాస్త్ర నమ్మకాల ప్రకారం, సంవత్సరంలో మొదటి రోజున […]
Nara Bhuvaneswari Nimmakuru visit: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పామర్రు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు.. స్థానికంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు.. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి.. చిన్ననాడు నిమ్మకూరులో గత స్మృతులను స్మరించుకున్నారు. వేసవి సెలవుల్లో నిమ్మకూరు వచ్చే వారని, సోదరితో కలిసి బస్సులో సినిమాకి పామర్రు వరకు వెళ్లే వాళ్లమని విషయాలను పంచుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని […]
YS Jagan: వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. రంగా కుమారుడు వంగవీటి రాధా వైసీపీలో ఉన్నంతకాలం రంగా జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన వైసీపీ.. ఆ తర్వాత అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంది.. కనీసం, గత ఐదేళ్ల వైసీపీ పాలనలోనూ వంగవీటి మోహన రంగా పేరుతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు వైసీపీ చేయలేదు.. అయితే, నేడు రంగా […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరం ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు విస్తరించడంతో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జోన్లు, సర్కిల్స్ సంఖ్యను పెంచింది. 6 నుండి 12 జోన్లు.. 30 నుండి 60 సర్కిల్స్‌కు పెంచింది.. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు.. ఉన్న 30 సర్కిల్స్‌ను 60కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. […]