AP District Reorganization: జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు.. చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల […]
Vijayawada Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పవర్ వివాదం చోటుచేసుకుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గంట సేపు కరెంటు కట్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో.. ఆ సమయంలో ఆలయ అధికారులు జనరేటర్ల ద్వారా దర్శనాలు కొనసాగించారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ విద్యుత్ అధికారులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం అమ్మవారి ఆలయానికి మళ్లీ కరెంటు సరఫరా ప్రారంభమైంది. అయితే, గత రెండేళ్లుగా అప్పారావుపేట పాముల కాలువ […]
Train Brakes Fail: విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.. పర్యాటకుల కోసం వేసిన టాయ్ ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అవడంతో రైలు ఒక్కసారిగా వెనక్కి పరుగు పెట్టింది.. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పర్యాటకులు.. ఘటన జరిగిన సమయంలో రైలులో సుమారు వంద మందికి పై గానే పర్యాటకులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. కోట్లాది రూపాయలు అభివృద్ధి కోసం కేటాయిస్తున్నప్పటికి.. నిర్వహణ సరిగ్గా […]
CM Chandrababu: జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నెల నవంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ నోటిఫికేషన్‌పై నెల రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించిన ప్రభుత్వం, నిర్దేశించిన గడువును నేటితో ముగించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 […]
Story Board: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 24, 2025న జీవో నంబర్ 292 జారీ చేసింది. దీని ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. 27 పురపాలక సంస్థలు GHMCలో విలీనమయ్యాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2,050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా 1.34 కోట్లు దాటింది. ఇది భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. సింగపూర్ కంటే మూడింతలు, మారిషస్ స్థాయి విస్తీర్ణం కలిగిన నగరంగా […]
Copper Price: అంతర్జాతీయంగా రాగి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పటికే ఓవైపు బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండగా.. మరోవైపు రాగి ధరలు కూడా ఆశ్చర్యపరిచేలా పెరుగుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధర టన్ను 12000 డాలర్లు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా రాగి ధరలు రికార్డు స్థాయిలకు పెరిగాయి. ఇండియాలోని MCXలో దాదాపు కిలో రాగి 1140 రూపాయల నుంచి 1160 రూపాయల మధ్య ట్రేడ్ […]
Vijayawada Metro : విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ భవితవ్యమేంటి..? కేంద్ర ప్రభుత్వం మౌనం దేనికి సంకేతం..? ఇతర రాష్ట్రాల మెట్రో ప్రాజెక్టులకు వరుసగా అనుమతులు ఇస్తున్న కేంద్రం… విజయవాడ మెట్రోకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడంలేదదన్నది ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి. తాజాగా ఢిల్లీ మెట్రో మలివిడత ప్రాజెక్టుకు 12 వేల కోట్లకు పైగా నిధులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అంతకుముందు పూణె, జైపూర్ మెట్రో రెండో దశలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విజయవాడ […]
Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన టీడీపీ నేతలకు నిరాశే ఎదురైంది. ఐతే…పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామని అధిష్టానం కొందరికి హామీలు ఇచ్చిందట. ఆ హామీలు నెరవేరకపోవటంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవుల మాటమోగానీ ఉన్న పార్టీ పదవులు కూడా ఉడిపోతున్నాయని భయపడుతున్నారట. ఉమ్మడి కర్నూలు జిల్లా…రెండు దశాబ్దాలకుపైగా ఎన్నికల్లో టీడీపీకి ఎప్పుడూ నిరాశే ఎదురైంది. అత్యధిక స్థానాలను […]
Off The Record: పెనుమత్స విష్ణుకుమార్ రాజు… విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే. NDAతో సంబంధం లేకుండానే మొదటి నుంచి టీడీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కమలం నేతల్లో ఈయనదే మొదటి స్ధానం అని చెబుతుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల కంటే విష్ణుకుమార్ రాజు వాయిస్సే ఎక్కువ వినిపించేదని టాక్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కోసం కొన్నిసార్లు భాష కట్టలు తెంచుకున్నా పెద్దగా ఫీల్ అయ్యేవారు కాదట ఈ సీనియర్ నేత. […]
Amur Falcon: నాన్ స్టాప్‌గా 6,100 కిలో మీటర్లు ప్రయాణం చేసి రికార్డులు బద్దలు కొట్టింది ఓ చిన్న పక్షి.. అదే ప్రపంచంలోని అతి చిన్న, సాహసోపేతమైన వలస పక్షులలో ఒకటైన అముర్ ఫాల్కన్.. ఈ పక్షి మరోసారి అద్భుతమైన విజయాన్ని సాధించింది. మణిపూర్ నుండి ఉపగ్రహ-ట్యాగ్ చేయబడిన మూడు అముర్ ఫాల్కన్లు – అపాంగ్, అలాంగ్, అహు – భారతదేశం నుండి దక్షిణ ఆఫ్రికాకు వేల కిలోమీటర్ల రికార్డు స్థాయిలో ప్రయాణించాయి. ఈ చిన్న పక్షులు […]