Motorolaలో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫోల్డబుల్.. లాంచ్‌కు రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోటరోలా మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హడావుడి చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా Motorola Razr 70 స్మార్ట్‌ఫోన్ UAEకి చెందిన TDRA (Telecommunications and Digital Government Regulatory Authority) డేటాబేస్‌లో కనిపించింది. XT2657-8 అనే మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ జాబితా కావడం ద్వారా, త్వరలోనే ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: డాల్బీ విజన్ సపోర్ట్, OLED డిస్‌ప్లే, 8,500mAh బ్యాటరీతో Redmi K90 Ultra
Also Read
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
టెక్ బ్లాగర్ అన్విన్ (@ZionsAnvin) X (ట్విటర్) వేదికగా షేర్ చేసిన సమాచారం ప్రకారం, Motorola Razr 70 కు UAEలో నియంత్రణ అనుమతి లభించింది. ఇది మోటరోలా నుంచి త్వరలో రానున్న తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు బలమైన సంకేతంగా భావిస్తున్నారు. ఇతర Motorola ఫోన్లు కూడా లిస్టింగ్‌లో.. Razr 70తో పాటు Motorola Razr 70 Ultra, Edge 70 Fusion, Moto G17, Moto G67, Moto G77 వంటి ఫోన్లు కూడా UAE TDRA డేటాబేస్‌లో కనిపించాయని సమాచారం.
వీటికి సంబంధించిన మోడల్ నంబర్లు: XT2605-2, XT2623-3, XT2655-1, XT2621-2, XT2621-4.. అయితే, ఈ ఫోన్ల లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్లపై మోటరోలా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇక, Motorola Razr 70, భారతదేశంలో మే 2025లో రూ. 49,999 ప్రారంభ ధరకు లాంచ్ అయిన Razr 60కి వారసుడిగా వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. Razr 60 ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్‌తో పాటు పాంటోన్ జిబ్రాల్టర్ సీ, లైటెస్ట్ స్కై, స్ప్రింగ్ బడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. Razr 60 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. Razr 70లో కొన్ని అప్‌గ్రేడ్‌లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు..
ప్రస్తుతం Razr 60లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు ఇవీ:
* 6.9-ఇంచ్ FHD+ pOLED LTPO ఫోల్డబుల్ డిస్‌ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్
* 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
* 3.63-ఇంచ్ pOLED కవర్ డిస్‌ప్లే
* 90Hz రిఫ్రెష్ రేట్
* 1,700 నిట్స్ బ్రైట్‌నెస్
* MediaTek Dimensity 7400X చిప్‌సెట్
* 8GB LPDDR4x RAM + 256GB UFS 2.2 స్టోరేజ్
* డ్యూయల్ రియర్ కెమెరా
* 50MP ప్రైమరీ
* 13MP అల్ట్రావైడ్
* 32MP ఫ్రంట్ కెమెరా
* 4,500mAh బ్యాటరీ
* 30W వైర్డ్
* 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి..
మొత్తంగా Motorola Razr 70 UAE సర్టిఫికేషన్‌లో కనిపించడం ద్వారా, మోటరోలా త్వరలోనే కొత్త ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయబోతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. Razr 70తో పాటు Edge, G సిరీస్ ఫోన్లు కూడా మార్కెట్‌లోకి రానున్నాయా అన్నది త్వరలో అధికారికంగా తేలనుంది.
తాజావార్తలు
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!