ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో కయ్యం ముదురుతోందట. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో మీటింగ్ గరగరంగా సాగినట్టు తెలిసింది.నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదుల వెల్లువలా వచ్చినట్టు తెలిసింది.ఆమె ముందే పరస్పరం కౌంటర్స్ వేసుకున్నారట నాయకులు. పక్క జిల్లాకు చెందిన నేత ఒకరు పార్టీని కులాల వారిగా విభజిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం ,గ్రూప్ లుగా మారడానికి సదరు నేతే కారణమని ముందు పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
వైసీపీ హయాంలో తమ నియోజకవర్గాల్లో హవా కొనసాగించిన ఆ ఎమ్మెల్యేలు.. మాజీలు కాగానే.. సీన్ మొత్తం మారిపోయింది. అసలు వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన వారి సంగతి ఒక ఎత్తైతే.. రాయలసీమలో బాబాయ్- అబ్బాయిల పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాబాయ్కాగా.. అబ్బాయ్ ధర్మవరం మాజీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఐదు స్థానాలకు గాను...ఒకటి కన్ఫామ్ అయిపోయింది. జనసేన తరపున నాగబాబుని ఇప్పటికే ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి టీడీపీకి మూడు వస్తాయి. ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా ? వద్దా ? అన్న డైలమాలో కాషాయ పార్టీ పడింది. మూడు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీకి వస్తుండటంతో ఆ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది.
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్.. నాగబాబు పేరు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. మరోవైపు సినీ నటుల కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరుస ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.. ఇవాళ ఢిల్లీలో కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం వివిధ కేంద్ర పథకాల కింద సహాయం చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది..
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు.. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గట్టిగా గళం వినిపించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
కేంద్ర ప్రభుత్వంగా కాదు.. మా బాధ్యతగా ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తున్నాం అన్నారు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరవాత దేశ వ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నాం. మొదట ముంబైలో.. రెండో చర్చ విశాఖ లో నిర్వహించాం అన్నారు.. విశాఖలో బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలను కలసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం అన్నారు..