* హైదరాబాద్: నేడు స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఉదయం 11 గంటలకు మహేశ్వరం నియోజకవర్గంంలో పర్యటన.. స్కిల్ యూనివర్సిటీ పనులు పరిశీలించనున్న సీఎం రేవంత్ రెడ్డి
* కడప: నేడు మహానాడు రెండవ రోజు ప్రతినిధులు సభ.. నిన్న ప్రవేశపెట్టిన తీర్మానాలను ఈరోజు ఆమోదించనున్న సభ.. రేపు దాదాపు 5 లక్షల మందితో భారీ సభ.. మహానాడు ప్రాంగణంలోనే బస చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్
* అమరావతి: ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం.. మండపేట, మదనపల్లె మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ మండల నేతలతో జగన్ భేటీ.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న జగన్..
* విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం పై రంగంలోకి ఈడీ .. కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డిని నేడు ఈడీ అధికారులు విచారించే ఛాన్స్.. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి నుంచి వాంగ్మూలం సేకరించడానికి అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసిన ఈడీ..
* నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన.. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్న జగన్.. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్న జగన్
* అన్నమయ్య జిల్లా: నేడు మదనపల్లి లో మెగా యోగాంధ్ర 2025 కార్యక్రమం. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లో 5 వేల మందితో మెగా యోగా కార్యక్రమం నిర్వహించనున్న ప్రభుత్వం. బీటీ కాలేజ్ గ్రౌండ్ లో ఉదయం 6.00 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు. 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగ ఆసనాలు.
* తిరుమల: జూన్ 9వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు.. మూడు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించనున్న టీటీడీ.. ఆ మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు
* తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 29న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
* గుంటూరు: నేడు వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీలోకి తీసుకోనున్న తుళ్లూరు పోలీసులు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో మూడురోజుల పోలీస్ కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతి.
* గుంటూరు: నేడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సీఐడీ కోర్టులో విచారణ. టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో ఆర్కేను నిందితుడిగా చేర్చిన సీఐడీ.
* శ్రీ సత్యసాయి: స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని హిందూపురంలో పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ కార్యక్రమం
* తూర్పు గోదావరి జిల్లా: నేడు యోగాంధ్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాజమండ్రిలోని అంగన్వాడి కార్యకర్తలకు యోగ అభ్యాస ప్రక్రియ.. సుమారు 2000 మంది అంగన్వాడీ కార్యకర్తలకు యోగ అభ్యాసం
* సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి జూన్ 12 వరకు సిటీ పోలీస్ యాక్ట్.. ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేషాలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని సీపీ అనురాధ ఆదేశాలు
* నిర్మల్: నేడు బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఆర్ జీయూకేటీలో 2025-26 సంవత్సరంలో బీటెక్ ఆరు సంవత్సరాల ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న అధికారులు.
* నల్లగొండ జిల్లాలో ఇంచార్జ్ మంత్రి తుమ్మల టూర్.. చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం, మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి తుమ్మల..
* నేడు వల్లభనేని వంశీ కస్టడీపై నూజివీడు కోర్టులో విచారణ.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కస్టడీ కోరిన పోలీసులు.