మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈరోజు విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసుల అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నానని చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టంచేశారు. పోక్సో కేసుకు సంబంధించిన విషయంలో, బాధితురాలి పేర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా మరికొందరు రాజకీయ నేతలు ప్రస్తావించారు అన్నారు. ఈ అంశంపై తాను అధికారికంగా ఫిర్యాదు చేస్తానని, చట్టం అందరికీ సమానంగా ఉండాలని అంటున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో శుభవార్త చెప్పింది.. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి అధికారికంగా ప్రారంభించారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పేరును ఖరారు చేశారు.. అయితే, బీజేపీకి ఈ సారి డౌటే అనే చర్చ సాగుతోంది.. మిగిలిన నాలుగు స్థానాల్లో.. టీడీపీ నుంచి ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది..
సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు.. తనపై వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో నమోదైన కేసులను క్వాష్ చేశాయంటూ పిటిషన్ వేశారు.. అయితే, పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్ల మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..
తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పట్టభద్రులు, ఒక టీచర్ సీట్లో ప్రభావం చూపిన కమలం పార్టీ... మరో చోట చతికిలపడింది. ఓడిపోయిన నల్గొండ టీచర్ సీటు విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదుకాబట్టి అలాంటి ఫలితమే వచ్చిందని అనుకున్నా.... మిగతా రెండు సీట్లలో పరిస్థితి చూస్తే మాత్రం.. ఇక తెలంగాణ మాదేనన్నంత ధీమాగా ఉన్నారట కాషాయ నేతలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్స్ కనిపించబోతున్నాయట. ఆ సన్నివేశాలు నియోజకవర్గంలో పాజిటివ్ వైబ్స్ తీసుకు వస్తాయా? లేక నెగెటివిటీని పెంచుతాయా అని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరడం ఖరారైపోయింది.
మృతుడు రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు.. నా భర్త రంగన్న అనారోగ్య సమస్యతో బాధపడేవారన్నారు.. గత ప్రభుత్వంలో మమ్మల్ని బాగా చూసుకున్నారు.. గత ప్రభుత్వంలో 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చేవారని తెలిపారు.. అయితే, గత మూడు నెలల నుంచి నా భర్త చాలా మానసికంగా దెబ్బతిన్నాడు.. నా భర్త ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారని వెల్లడింఆచరు.. నీవు వచ్చేలోపు నేను బ్రతుకుతానో లేదో అని నాతో అన్నాడని గుర్తుచేసుకున్నారు.
ఇంట్లో రచ్చ... బయటా రచ్చే.... ముందూ వెనకా చూసుకోకుండా మాట విసిరేయటం, తర్వాత గొడవ కొని తెచ్చుకోవడం.... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఇది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంఇ.. చట్ట విరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్..