Covid 19: కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది.. ప్రపంచవ్యాప్తంగా విజృంభించి.. ఎన్నో లక్షలమంది ప్రాణాలు తీసిన మాయదారి వైరస్.. మరోసారి విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయినట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.. అయతే, ఏపీలోనూ కోవిడ్ 19 కేసులు వెలుగు చూస్తున్నాయి.. రాష్ట్రంలో తాజాగా, మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో పరీక్షల అనంతరం ఏలూరుకు చెందిన భార్యాభర్తలకు కరోనా సోకినట్లుగా తేల్చారు వైద్యులు.. మరోవైపు, తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడ్డారు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇద్దరికి కరోనా నిర్ధారణ కాగా, దేశవ్యాప్తంగా కేసులు వెయ్యి దాటినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా బారినపడకుండా.. ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు..