TDP Mahanadu 2025: తొలిరోజు అట్టహాసంగా ప్రారంభం అయ్యింది టీడీపీ మహానాడు.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. తిరుమల తొలిగడప, దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక, మహానాడు ఈ రోజు కీలక ఘట్టానికి వేదిక కానుంది.. టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరగనుంది.. సాయంత్రం నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుని చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.. పోటీ లేనందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.. అయితే, గత కొంత కాలంగా పార్టీలోనూ మంత్రి నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతూ వస్తోంది.. దీంతో, లోకేష్‌కి ఏం బాధ్యతలు ఇస్తారు? అనేది ఆసక్తికరంగా ఆమారింది.. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు లోకేష్.. ఇప్పుడు మరింత కీలకమైన పదవి కట్టబెడతారని తెలుస్తుండగా..? అది ఏ పదవి అనేది చర్చగా మారింది..
Read Also: Kubera : నాగార్జునపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ధనుష్ ..
కాగా, ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు కూటమికి కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం కోసమే కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే.. సార్వత్రిక ఎన్నికల్లో 57 శాతం ఓట్ షేరింగ్ సాధించినట్లు సీఎం వివరించారు. కార్యకర్తల పట్టుదల, శ్రమ వల్లే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయింది. ఇక, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు నారా లోకేశ్. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదించారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవల్లో సోషల్ రీఇంజినీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత. అనే ఆరు శాసనాలను సభ ముందుంచారు లోకేష్. ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి పెట్టని కోట.. అయితే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా పది స్థానాలకు గాను ఏడు స్థానాలను దక్కించుకుంది కూటమి… దీంతో జోష్ లో ఉన్న టీడీపీ కడపలో మహానాడు నిర్వహిస్తోంది..