తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల ప్రక్రియకు తెర లేచింది. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేలోపే అందుకు సంబంధిచిన షెడ్యూల్ విడుదలైపోయింది. ఈనెల 20న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. పదో తేదీ నామినేషన్ దాఖలుకు ఆఖరు. ఈ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. ఈ విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..
వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమమని పేర్కొన్న ఆమె.. వంశీని అరెస్ట్ చేసిన సమయంలో పటమట పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచాలని పంకజ శ్రీ తన పిటిషన్లో పేర్కొన్నారు..
వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తి ఈ రోజు మృతిచెందారు.. వైఎస్ వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.. రంగన్న వయస్సు 85 సంవత్సరాలు.. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగన్న తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. అయితే, కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రంగన్న మృతిచెందారు
పోసాని కేసులో కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు ఆదోని పోలీసులు.. మరోవైపు, పోసాని కృష్ణ మురళికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.. ఈ రెండు పిటిషన్లపై రేపు కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో విచారణ జరగనుంది.. ఇక, పోసాని మురళి కృష్ణకు 14 రోజులు రిమాండ్ విధించింది కర్నూలు కోర్టు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు మంత్రి నాదెండ్ల మనోహర్.. గత ప్రభుత్వంలో 650 కోట్ల రూపాయలతో సలహాదారులు నియమించుకున్నారు.. అంత మంది సలహాదారులను నియమించుకుని కనీసం జల్‌జీవన్ మిషన్ లో రాష్ట్రానికి వచ్చిన ఫండ్ ఉపయోగించుకోలేకపోయారు అంటూ దుయ్యబట్టారు..
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మేథావి వర్గం ఆలోచనలను పసిగట్టకుండా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాయనే చర్చ విస్త్రతంగా జరుగుతోంది. వైఫల్యం ఎక్కడ జరిగింది ? బాధ్యులు ఎవరనే పోస్ట్ మార్టం మొదలైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజవర్గంలో జరక్కూడనిదేదో జరిగిపోతోందని సొంత పార్టీ జనసేన కేడరే గుర్రుగా ఉందట, గుసగుసలాడుకుంటోందట. నాడు నెత్తిన పెట్టుకుని గెలిపించుకున్న ఎమ్మెల్యే దేవ ప్రసాదరావుకు ఇప్పుడు అంత కానివాళ్ళం అయిపోయామా అంటూ... కార్యకర్తలు నిష్టూరాలాడుతున్నట్టు సమాచారం.
మన్యం జిల్లా... పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చందర్. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు. మామూలుగా అయితే... ఉప్పు నిప్పులా ఉండాల్సిన రాజకీయం ఇద్దరిదీ. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు అలాగే ఉందట కూడా. కానీ... ఎలక్షన్స్ తర్వాత సీన్ కంప్లీట్‌గా మారిపోయిందట. మనం మనం పార్వతీపురం అనుకుంటూ..