సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదలకు మోక్షం మాత్రం కలగడంలేదు.. ఈ రోజు బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం కావడంతో జైలు నుండి పోసాని కృష్ణ మురళి విడుదల కాలేకపోయారు.. రేపు విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు.. మరోవైపు, బెయిల్ వచ్చినా పోసాని కృష్ణమురళి విడుదల అయ్యే వరకు అనుమానమే అంటున్నారు పోసాని సన్నిహితులు..
ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అర్హత నిర్ధారణ పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖ రాశారు.. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అర్హత నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కు అనుగుణంగా రాష్ట్రంలో కుడా నిర్ణయం తీసుకోవాలని సీఎంను లేఖలో కోరారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. కర్నూలు జిల్లా పర్యటనకు రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. తిరిగి హైదరాబాద్కు చేరుకోవడంతో పవన్ కల్యాణ్ పర్యటన ముగియనుంది..
పోసానికి ఊరట లభించింది.. ఇవాళ లేదా రేపు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.. ఇవాళ సీఐడీ కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజురు చేసింది గుంటూరు కోర్టు.. దీంతో, ఆయనకు బిగ్ రిలీఫ్ దక్కినట్టు అయ్యింది..
శ్రీశైలంలో ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు పాదయాత్రగా వచ్చే కైలాశద్వారం వద్ద భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు ఈవో శ్రీనివాసరావు.. కన్నడ భక్తులు సేదతిరే చలువ పందిళ్లు, స్వచ్ఛసేవ, అన్నదానలను పరిశీలించారు ఈవో.. మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ద పెట్టి.. పాదయాత్ర కన్నడ భక్తులకు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు..
విశాఖపట్నం అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ప్రజల అభిప్రాయం తర్వాత మాత్రమే వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతుందన్నారు మంత్రి నారాయణ.. గత ప్రభుత్వం స్వార్ధ పూరితంగా ఆలోచించి వైజాగ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని విమర్శించారు.. వైజాగ్ మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి, భూ సమస్యలుపై విశాఖ ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.
వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. విచారణ వాయిదా పడుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఈ రోజు పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. వంశీతో తనకి ప్రాణహాని ఉందంటూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సత్యవర్ధన్.. దీంతో, ఈ కేసులో విచారణ అధికారి.. తమ ముందు…
అనంతపురం నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ క్లియర్ కట్ మెజార్టీతో పీఠంపై ఉంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 48 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వారిద్దరు కూడా వైసీపీకి మద్దతు పలికారు. అయితే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వసీం సలీంని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. అది అప్పట్లో చాలామందికి నచ్చలేదు. పైగా అనంత వెంకటరామిరెడ్డికి మేయర్ వసీంకి వ్యతిరేకంగా కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు.