Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు వచ్చేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులకు తన నటనతో దగ్గరైన మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీ వెండితెరకు పరిచయమయ్యారు. ఒక సాలిడ్ యాక్షన్ డ్రామాగా, గ్లామరస్ ఎంట్రీగా భావించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఆశలు అడియాసలయ్యాయి.
Also Read : Rakasa : ‘రాకాస’ అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది : నిహారిక కొణిదెల
Also Read
దాంతో లాంగ్ గ్యాప్ తీసుకుని మరోసారి బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనుంది కీర్తి సురేష్. తన రెండో హిందీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా ‘రాఫ్తార్’ అనే సినిమాలో నటిస్తోంది. సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబైంది. ఈ సినిమా మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు ఆదిత్య నింబల్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. రాజ్ కుమార్ రావు వంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోతో కీర్తి జతకట్టడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘బేబీ జాన్’ ఫలితంతో సంబంధం లేకుండా, ‘రాఫ్తార్’ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో తన సత్తా చాటుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. వరుణ్ ధావన్ తో నటించి ప్లాప్ తెచ్చుకున్న కీర్తి ఇప్పుడు రాజ్ కుమార్ రావు ఎలాంటి ఫలితం అందుకుంటుందో మరికొన్ని నెలల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?