నియోజకవర్గాల పునర్విభజనపై ఆహ్వానం వచ్చింది.. కానీ, హాజరు కాలేమని సమాచారం ఇచ్చామని జనసేన ప్రకటించింది.. చెన్నైలో డీఎంకే.. నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది.. అయితే, హాజరుకాలేమని సమాచారం అందించామని పేర్కొంది..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి కూడా ప్రతిపక్షం లేకుండానే జరిగాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవడం మినహా... ఆ తర్వాత వైసీపీ నుంచి హాజరు లేదు. అదే సమయంలో... కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది కాస్త ముందుకు వెళ్ళి.... వాళ్ళు లేకపోతేనేం.... మేమున్నాంగా.... అంటూ, ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేశారు. ధూళిపాళ్ళ నరేంద్ర, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి..
కొలికపూడి శ్రీనివాసరావు..... ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే. స్థానికుడు కాకున్నా... ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందే టికెట్ తెచ్చుకుని కూటమి హవాలో ఫస్ట్ అటెంప్ట్‌లోనే అసెంబ్లీ మెట్లు ఎక్కేశారాయన. గత మూడు దఫాలుగా టీడీపీకి తిరువూరులో అందని ద్రాక్షగా ఉన్న విజయాన్ని తొలిసారే దక్కించుకోవడంతో... తమకు అండగా ఉంటారని ఆశపడిందట తిరువూరు టీడీపీ కేడర్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కులం కుంపటి పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కమ్మ వర్సెస్ కాపుగా మారడం ఆందోళనకరమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే పార్టీ పాత నాయకులు, మారి వచ్చిన వాళ్ళు అన్న లెక్కలు కూడా ఉన్నాయట. చివరికి మేటర్ ముదిరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళిందట.
శ్రీశైలం జలాశయంలో ఒకవైపు నీటిమట్టం వేగంగా పడిపోతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండగా.. కుడి విద్యుత్ కేంద్రంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రోజుకు ఒక టీఎంసీకి పైగానే విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుండడంతో సమీప కాలంలోనే శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది..
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కంటే ఎక్కువగా... వలసల మీదే ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోందట. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక వన్ బై వన్ కీలక నేతలు సైతం బైబై చెబుతుండటం, అందుకు అధిష్టానం నుంచి కనీస స్పందన లేకపోవడం గురించి నాయకులంతా తెగ చెవులు కొరికేసుకుంటున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని, మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు లాంటి ముఖ్య నాయకులతోపాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా…
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కేసీఆర్ అంటే... ఎవరికి తెలియదని, ఆయన గురించి అంత ఉపోద్ఘాతం అవసరమా అనుకుంటున్నారా? యస్... మీరనుకునేది కరెక్టేగానీ... అసలు మేటరంతా అక్కడే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
పోసానికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. లక్ష రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది.. ఇక, వారానికి రెండు రోజులు సీఐడీ రీజనల్ ఆఫీసుకి వచ్చి సంతకాలు చేయాలని షరతులు విధించింది.. విచారణకు పూర్తిగా సహకరించాలి.. ఈ సమయంలో దేశం విడిచి వెళ్లకూడదు.. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదు.. పత్రికల్లో ఎటువంటి ప్రకటనకు చేయకూడదు అని గుంటూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాప్స్ మీద మెరుపు దాడులు జరిగాయి. 100 బృందాలతో ఈ తనిఖీలు చేపట్టారు. మందుల షాపులు, మందుల ఏజెన్సీలపై ఈ దాడులు చేశారు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో మెరుపు దాడులు కొనసాగాయి..