Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. అసలు, విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి సబంధం లేదని స్పష్టం చేసింది.. కొమ్మినేని విడుదల నిబంధనలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది.. ఇక, ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, వాటిని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని వార్నింగ్ ఇస్తూ.. భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది సుప్రీంకోర్టు..
Read Also: Israel-Iran War: సంయమనం పాటించండి.. ఇరు దేశాలకు భారత్ సందేశం
కాగా, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌లో నిర్వహించిన చర్చ కేసులకు దారి తీసిన విషయం విదితమే.. ఆ చర్చలో పాల్గొన్న జర్నలిస్టు కృష్ణంరాజు.. అమరావతి రాజధానిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వివాదమైంది.. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏపీవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనకు దారి తీసింది.. ఇక, ఈ క్రమంలో పలు ఫిర్యాదులు అందగా.. కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు, కృష్ణంరాజు, ఆ షో ప్రసారం చేసిన టీవీ యాజమాన్యంపైనా కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం ఉదయం కొమ్మినేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఏపీకి తరలించిన విషయం విదితమే..