మరోసారి శ్రీవారి ఆలయం మీదుగా విమానం..
తిరుమలలో మరోసారి ఆగమ శాస్త్రం ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం వెళ్లడం భక్తులను ఆవేదనకు గురిచేసింది. ఆగమశాస్ర్తం నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగుకూడదని ఆగమ పండితులు పేర్కొంటున్నా.. అందుకు విరుద్ధంగా ఆలయ గోపురంపై విమానాలు వెల్తూండడం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికే తిరుమలకు వున్న ప్రాధ్యానత దృష్యా శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు నిషేధించాలని.. తిరుమలను నో ప్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కోరినా.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు కేంద్రం.. అయితే, ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని.. ఆగమ శాస్త్రం ఉల్లంఘనకు తావులేకుండా చూడాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు..
శ్రీవారి ప్రసాదాల రుచి, నాణ్యత బాగా పెరిగింది.. నిర్మాత సురేష్ బాబు ప్రశంసలు..
శ్రీవారి ప్రసాదాల రుచి, నాణ్యత బాగా పెరిగిందని కితాబిచ్చారు టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు.. కుటుంబసభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన దగ్గుబాటి సురేష్ బాబు.. ఈ రోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు సురేష్ బాబు.. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు.. నడకదారులు మంచి ఏర్పాట్లు చేశారని.. భద్రతాపరంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసారన్న సురేష్ బాబు, ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా షూటింగ్ జరుగుతుందని వెల్లడించారు టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. ఇక, శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన సురేష్‌బాబుతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు, టీటీడీ సిబ్బంది పోటీపడ్డారు..
కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్.. కీలక ఆదేశాలు
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. అసలు, విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి సబంధం లేదని స్పష్టం చేసింది.. కొమ్మినేని విడుదల నిబంధనలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది.. ఇక, ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, వాటిని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని వార్నింగ్ ఇస్తూ.. భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది సుప్రీంకోర్టు.. కాగా, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌లో నిర్వహించిన చర్చ కేసులకు దారి తీసిన విషయం విదితమే.. ఆ చర్చలో పాల్గొన్న జర్నలిస్టు కృష్ణంరాజు.. అమరావతి రాజధానిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వివాదమైంది.. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏపీవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనకు దారి తీసింది.. ఇక, ఈ క్రమంలో పలు ఫిర్యాదులు అందగా.. కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు, కృష్ణంరాజు, ఆ షో ప్రసారం చేసిన టీవీ యాజమాన్యంపైనా కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం ఉదయం కొమ్మినేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఏపీకి తరలించిన విషయం విదితమే..
విమాన ప్రమాదం జరిగింది అందుకే.. తెలంగాణ ఏవియేషన్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం సాంకేతిక సమస్య వల్ల జరిగింది అన్నారు. విమానానికి ఉన్న రెండు ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చాం.. ఒక ఇంజిన్ లో ఎర్రర్ వస్తే మరో ఇంజన్ తో విమానం నడుస్తుంది.. కానీ, ఈ సంఘటన లో రెండు ఇంజన్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం నెలకొంది.. రెండు ఇంజన్లకు ఇంధనం అందకపోవడం వల్ల ఒక్కసారిగా ఇంజన్లు ఆగిపోయాయి.. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానానికి సిగ్నల్ వ్యవస్థ కట్ అయింది.. ఇంధనం కూడా అందలేదు.. విమాన ప్రమాదాలు మూడు రకాలుగా చూస్తాం.. పక్షులు ఢీ కొట్టినా.. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. టెక్నికల్ ఎర్రర్ వచ్చినా.. ప్రమాదాలు జరుగుతాయని ఎస్ఎన్ రెడ్డి పేర్కొన్నారు.
సంయమనం పాటించండి.. ఇరు దేశాలకు భారత్ సందేశం
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. ఇరాన్‌లో 100 లక్ష్యాలను ఇజ్రాయెల్ ఎంచుకుంది. ఒకేసారి 200 యుద్ధ విమానాలు ఎటాక్ చేశాయి. అంతే ఇరాన్ భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన టాప్ కమాండర్స్‌తో పాటు అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. 100 డ్రోన్లను ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. ఇక పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై భారత్ స్పందించింది. ఇరు దేశాలతో మంచి సంబంధాలను భారత్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్.. ఇరు దేశాలకు కీలక సందేశం పంపించింది. ఇరాన్-ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని కోరింది. సాధ్యమైనంత మద్దతును అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్రిక్తతలను తగ్గించి.. చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అన్ని పరిస్థితుల్ని గమనిస్తున్నామని.. అవసరమైతే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ముందుకొస్తుందని ప్రకటించింది. ఏ సమస్యకైనా పరిష్కారం దౌత్య మార్గాలేనని తెలిపింది.
ఎయిర్ ఇండియా క్రాష్.. ఇండియాలోనే భారీ “ఇన్సూరెన్స్ క్లెయిమ్” కావచ్చు..
ఎయిరిండియా ప్రమాదం ఎవియేషన్ ఇండస్ట్రీలోనే అత్యంత దారుణమైన సంఘటనల్లో చేరింది. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కి వెళ్తున్న విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మినహా 242 మందిలో అందరూ చనిపోయారు. మెడికల్ హాస్టల్ భనవంపై కూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. మొత్తంగా 265 మంది చనిపోయారు. అయితే, ఇప్పుడు ప్రమాదంపై ఇన్సూరెన్స్‌పై చర్చ జరుగుతోంది. భారతదేశ బీమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావచ్చని పలువురు చెబుతున్నారు. ఈ ప్రమాదం వల్ల కలిగిన నష్టం 211 మిలియన్ డాలర్ల నుంచి 280 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అంటే రూ. 2400 కోట్లు. ప్రభుత్వ రంగ రీఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రామస్వామి నారాయణన్ ప్రకారం, విమాన సంస్థ ఫ్లీట్ ఇన్సూరెన్స్ పాలసీ సాధారణంగా విమాన భాగాలు, విడిభాగాలు, ప్రయాణికులకు, థర్డ్ పార్టీకి జరిగిన నష్టాలను కవర్ చేస్తుంది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మరణించారు. ఈ ప్రమాదంలో విమానానికి, జరిగిన నష్టాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. ఈ క్లెయిమ్ ఏజ్, కాన్ఫిగరేషన్, ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది.
వన్డేల్లో చరిత్ర సృష్టించిన పసికూన నెదర్లాండ్స్.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!
పసికూన నెదర్లాండ్స్ టీమ్ వన్డేల్లో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మూడో భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్ నమోదు చేసింది. 2023–27 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్‌లో భాగంగా గురువారం ఫోర్తిల్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో అంతర్జాతీయ వన్డేల్లో మూడో భారీ లక్ష్య ఛేదన రికార్డును ఖాతాలో వేసుకుంది. మొదటి రెండు రికార్డులు దక్షిణాఫ్రికా పేరిట ఉన్నాయి. అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 435 లక్ష్యంను దక్షిణాఫ్రికా 9 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. 2016లో డర్బన్‌లో అదే ఆస్ట్రేలియా నిర్ధేశించిన 372 టార్గెట్‌ను ప్రొటీస్ టీమ్ 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. 2025లో డండీలో స్కాట్లాండ్‌పై నెదర్లాండ్స్ 370 లక్ష్యంను మరో నాలుగు బంతులు ఉండగానే ఛేదించింది. ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. 2013లో జైపూర్‌లో ఆస్ట్రేలియాపై నిర్ధేశించిన 360 టార్గెట్‌ను టీమిండియా (362/1) అందుకుంది. 2019లో బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్ (361)పై ఇంగ్లండ్ (364/4) భారీ లక్ష్య ఛేదన సాధించింది.
రామ్ చరణ్-త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా? లేనట్టా?
రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. నిజానికి అదేమీ లేదని అర్థమయ్యేలా త్రివిక్రమ్ తరపున నిర్మాత నాగ వంశీ ఒక ట్వీట్ వేశాడు. ప్రస్తుతానికి వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రమే త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, ఆయనకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా తాను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని చెప్పాడు. అయితే, రామ్ చరణ్‌తో సినిమా ఉంటుందా, ఉండదా అనే చర్చపై అనేక వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పట్లో రామ్ చరణ్ త్రివిక్రమ్‌తో సినిమా చేసే అవకాశం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా సైన్ చేశాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనుకున్నాడు, కానీ కొన్ని అంతర్గత కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టేశాడు.
మీడియా ‘లేపితే’ మాత్రం సినిమాలు ఆడేస్తాయా?
ఒకప్పుడు సినిమా ఫలితాలపై లేదా కలెక్షన్లపై మీడియా ప్రభావం కొంతవరకు ఉండేది. కానీ సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు సినిమాలపై మీడియాకు పెద్దగా పట్టు లేకుండా పోతోంది. నిజానికి, ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఒక సినిమా విజయానికి లేదా కలెక్షన్లకు మీడియా కేవలం దోహదం చేసేది, కానీ పూర్తిగా మీడియా వల్ల ఏమీ జరిగేది కాదు. అయితే, ఇప్పటి పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు తమ సినిమా బాగున్నా, బాగోకపోయినా, పెయిడ్ క్యాంపెయిన్‌లు నిర్వహిస్తూ, సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన జర్నలిస్టుల ద్వారా “ఆహా, ఓహో, అద్భుతం” అంటూ ముందుగానే హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సైలెంట్‌గా అనౌన్స్ చేసి రిలీజ్ చేసిన ఒక సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. “ఇంకేదో జరిగిపోతోంది, తెలుగు సినీ చరిత్రలో అద్భుతం రాబోతోంది” అన్నట్లు దాన్ని ఒక రేంజ్‌లో హైప్ చేశారు. ఇది బిజినెస్ కోసమా లేక తమ ప్రభావం కోసమా తెలియదు, కానీ ఒక టీజర్‌తోనే ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్‌ను కలిగించడం కామెడీగానే ఉంది. ఇక ఇప్పుడు కుబేర సినిమా ప్రమోషన్స్‌లో నిర్మాత ఏషియన్ సునీల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. “ఖలేజాకి మంచి కలెక్షన్లు వచ్చాయి కదా? రిలీజ్‌లు అంటే అవును, వీళ్లు మళ్లీ రేటింగ్స్ ఇవ్వలేదు కాబట్టి వచ్చాయి” అంటూ కామెంట్ చేశాడు.