Borugadda Anil: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనిల్ పై రాష్ట్రవ్యాప్తంగా 50కిపైగా కేసులు నమోదయ్యాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో గుంటూరు, అనంతపురం జిల్లాలలో బోరుగడ్డపై కేసులు నమోదయ్యాయి. గుంటూరులో చర్చి వివాదంలో కర్లపూడి బాబూప్రకాష్ ను బెదిరించిన ఘటనపై కేసు నమోదు అయ్యింది. గతేడాది అక్టోబర్ లో బోరుగడ్డను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చడంతో రిమాండ్ విధించింది. దీంతో బోరుగడ్డను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటినుంచి బోరుగడ్డపై నమోదైన కేసులలో పోలీసులు వివిధ కోర్టులలో హాజరుపర్చారు. 2016లో పెదకాకాని సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదిరించిన కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చెయ్యడంతో గుంటూరు జిల్లా జైలునుంచి బోరుగడ్డ విడుదలయ్యారు.
Read Also: Air India Plane Crash: 2000 మందిని రక్షించిన ఎయిర్ ఇండియా పైలట్లు..