Off The Record: బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు…. అందరూ అందరే. అంతా సీనియర్ లీడర్సే. కొందరు రాష్ట్ర స్థాయిలో, కొందరు నియోజకవర్గంలో చక్రాలు తిప్పేసిన వారే. అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు వాయిస్ రెయిజ్ చేసిన వారే. కానీ… కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి…. సదరు లీడర్స్ స్వరాలు మూగబోయాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ వాల్యూమ్‌లో ఫ్యాన్ కిందినుంచి పక్కకు వచ్చేసి టీ గ్లాస్ పట్టుకున్నారు ఈ నేతలంతా. మొదట్లో అడపాదడపా… స్వరాలు వినిపించినా…. మెల్లిగా అంతా మ్యూట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? సీనియర్స్ అయిఉండి కూడా ఎందుకు మాట్లాడ్డంలేదు? వాళ్ళపాటికి వాళ్ళు సైలెంట్‌గా సర్దుకుని… ఓ మూలన కూర్చుని మాడిపోయిన మసాలా దోశ తింటూ సినిమా చూస్తున్నారా? లేక జనసేన అధిష్టానమే పక్కన పెట్టేసిందా? అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయ విశ్లేషకులకు.
Read Also: Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్‌డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
ఓటమి తర్వాత వైసీపీలో మారిన సమీకరణలు, పరిస్థితుల్ని బట్టి… జనసేనవైపు మొగ్గారు ఈ సీనియర్ లీడర్స్. పదవుల మీద ఆశే వీళ్ళని జనసేనవైపు నడిపించిందని అప్పట్లో చెప్పుకున్నారు అంతా. ఇక సీనియారిటీ పరంగా చూసుకున్నా…. జనసేనలో నాదెండ్ల మనోహర్ తప్ప… వీళ్ళకంటే సూపర్ సీనియర్స్ పెద్దగా లేరు. అందుకే వీళ్ళ సీనియారిటీని, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుంటారని, ఏదో ఒక పదవి వస్తుందని అంచనా వేశారు ఎక్కువ మంది. కానీ… టైం గడిచేకొద్దీ… పదవులు కాదు కదా… పార్టీ వేదికల మీద ఈ సీనియర్స్ కనిపించడమే లేదు. అసలు పార్టీ పరమైన నిర్ణయాల్లో వీళ్ళ ప్రమేయమే లేకుండాపోయిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇదే జనసేన వర్గాల్లో హాట్ టాపిక్. మొదట్లో గలగలా సౌండ్స్ చేసిన నేతలు ఇప్పుడెందుకు గమ్మున ఉన్నారన్నది అంతుబట్టడం లేదంటున్నాయి జనసేన శ్రేణులు. బాలినేని, సామినేని, కిలారి 2024 సెప్టెంబర్‌లో జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక పిఠాపురం నేత పెండెం దొరబాబు 2025 మార్చిలో చేరారు. కానీ… వీళ్ళందరికీ పదవుల పరంగా నిరాశే మిగిలినట్టు చెప్పుకుంటున్నారు. సామినేని ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా… అక్కడ చేసేదేం లేదన్నట్టుగా ఉన్నారట ఆయన. అటు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరిగింది మొదట్లో. తీరా… ఇప్పుడు చూస్తే… ఎమ్మెల్సీ తర్వాతి సంగతి… అసలాయన పార్టీలో ఉన్నారో లేదో కూడా అర్ధంకాని పరిస్థితి ఉందని అంటున్నారు.
Read Also: Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్‌డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
కిలారి రోశయ్య, పెండెం దొరబాబుకైతే అసలు ఏ బాధ్యతలూ లేవు. ఇలా…. ఒకప్పటి వైసీపీ మౌత్ పీస్‌లంతా… జనసేనలోచేరాక కనిపించకుండా పోవడం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీ కార్యక్రమాలు, అధికారిక స్పందనల్లో ఎక్కడా వీరి మార్క్ కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఇయర్‌ని పురస్కరించుకుని సుపరిపాలనకు ఏడాది- పీడ విరగడై ఏడాది పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో సైతం ఈ సీనియర్స్ కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. ఇదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ కోసం వెళ్ళారు జగన్. గిట్టుబాటు ధర ఇవ్వడంలేదంటూ అక్కడ ప్రభుత్వాన్ని నిలదీశారాయన. కానీ… ఆ వ్యాఖ్యల మీద అదే జిల్లాకు చెందిన నేతగా బాలినేని ఎక్కడా స్పందించలేదు. అటు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని కూడా స్పందించకపోవడం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. అటు తెనాలిలో పోలీస్ దెబ్బలు తిన్న యువకుల కుటుంబాలను జగన్ వెళ్లి పరామర్శించినా…. పక్క నియోజకవర్గంలోనే ఉన్న రోశయ్య నుంచి నో రియాక్షన్. దీంతో వీళ్ళంతా అసలు జనసేనలో ఉన్నాట్టా లేనట్టా అన్న డౌట్స్ వస్తున్నాయట కొందరికి. అదే సమయంలో ఇదంతా టీడీపీకి సంబంధించిన వ్యవహారం, మధ్యలో మనమెందుకు జోక్యం చేసుకోవాలన్నట్టుగా ఉన్నారా? అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. మొత్తం మీద జనసేనలో ఉన్న సీనియర్స్ నిర్బంధ మౌనం పాటిస్తున్నారా? లేక స్వచ్చందంగా సైలెంట్ అయ్యారా అన్నది పొలిటికల్ క్వశ్చన్.