Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పవర్‌లోకి వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో… ఈ టైంలో మనోళ్ళు ఏం చేశారు? నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనానికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఘనకార్యాలు వెలగబెడుతున్నదెవరంటూ… ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు. కేవలం రిపోర్ట్‌లు తీసుకోవడానికే పరిమితం అవకుండా… కాస్త తేడాగా అనిపించిన ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారట ఆయన. వన్ టైమర్స్‌గా మిగిలిపోవద్దని, జనంలో ఉండాలని హెచ్చరిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా… ప్రస్తుతం ఉన్న ఫీడ్ బ్యాక్ ప్రకారమే తర్వాతి ఎన్నికల్లో టికెట్లు వస్తాయని కూడా చెబుతున్నారట. దీంతో ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల్లో కూడా కొత్త చర్చ మొదలైందట. కొంతమంది మంత్రులు ఇప్పటికే పదవులు ఉంటాయో పోతాయో అన్న డైలమాలో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వ్యాఖ్యలతో సదరు డౌట్‌ఫుల్ మినిస్టర్స్‌లో మరింత గుబులు మొదలైనట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్‌డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
అటు కొందరు ఎమ్మెల్యేల్లో కూడా ఇదే రకమైన ఆందోళన ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు మంత్రుల మీద ఇప్పటికే సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆ అసహనాన్ని బయటికి ప్రదర్శిస్తున్నారు కూడా. వైసీపీకి కౌంటర్స్ ఇవ్వడంలోగాని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని జనంలోకి తీసుకెళ్లడంలోగాని కొంతమంది మంత్రులు విఫలం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇలాంటి వాతావరణంలో… పదే పదే సర్వే రిపోర్ట్‌ల గురించి మాట్లాడుతుండటంతో… కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పల్స్‌రేట్ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అసలు తమ పదవి ఉంటుందా ఊడుతుందా అని కూడా ఒకరిద్దరు మంత్రులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అలాగే… పనితీరు సరిగా లేని కొంతమంది మంత్రుల శాఖలు మారుస్తారన్న చర్చ సైతం ఉంది. దీంతో మా శాఖ మారుతుందా…అంటూ పదే పదే ప్రశ్నిస్తూ… సమాధానం కోసం ఎదురు చూస్తున్నారట సదరు టెన్షన్ పార్టీస్. ఇదేం ఆషామాషీగా లేదని, ఈ విషయంలో చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారన్న చర్చలు సైతం నడుస్తున్నాయట మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవడంతోపాటు.. వచ్చే ఎన్నికల గురించి కూడా ఇప్పుడే మాట్లాడుతుండటం కాస్త ఆందోళనగానే ఉందని అంటున్నారట కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు.
Read Also: Off The Record: సహచరులకు ఇబ్బందిగా మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు
కనీసం అరడజన్ మంది మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాదిలోనే పరిస్థితి ఇలా ఉంటే… ఇక ముందు ముందు ఇంకెంత టైట్ అవుతుందోనని మంత్రులు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. అటు ఎమ్మెల్యేల్లో సైతం ఇదే రకమైన టెన్షన్ ఉందని అంటున్నారు. నియోజక వర్గంలో ఏం జరుగుతోందో ప్రతి విషయం సీఎం దృష్టికి వెళుతోందనే ఆందోళనలో ఉన్నారట టీడీపీ ఎమ్మెల్యేలు. సర్వే రిపోర్ట్ లో చాలామంది శాసనసభ్యుల మీద నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఉందని, అలాంటి వాళ్ళందరి మీద సీఎం నజర్‌పెట్టారన్నది టీడీపీ ఇంటర్నల్ టాక్. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మాటలు కూడా వినిపిస్తుండటంతో… ఇకనన్నా జాగ్రత్త పడాలని కొందరు అనుకుంటున్నట్టు సమాచారం. అయితే…జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా సైలెంట్ అవుదామని అనుకుంటారా? లేక ఎలాగూ పెద్దాయనకు తెలిసిపోయింది కాబట్టి…. వచ్చే ఎన్నికలనాటికి అప్పటి లెక్కలు అప్పుడు, ఇప్పుడు మన పాటికి మనం దున్నేద్దామని అనుకుంటారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయట పార్టీ వర్గాల్లో. మొత్తం మీద టీడీపీలో సర్వే ప్రకంపనలు మాత్రం గట్టిగానే ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.