మరోసారి అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా భూమిలో అడుగుపెడితే ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొట్టానంటూ గతంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..
కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది..
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ.. అసలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఈ స్టార్ ఆటగాళ్లు గ్రేడ్ A+ కాంట్రాక్ట్‌ను కోల్పోతారా? అనే సందేహాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై క్లారిటీ వచ్చేసింది.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. T20 మరియు టెస్ట్‌ల నుండి రిటైర్ అయినప్పటికీ స్టార్ ఇండియా బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ గ్రేడ్ A+ కేటగిరీలోనే ఉంటారని స్పష్టం…
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు..
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జమ్మూ కాశ్మీర్లో పానీపూరి బండి నడుపుకునే వ్యక్తికి తెలిసిన సమాచారం కూడా కేంద్ర నిఘావర్గాలకు తెలియడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే పాకిస్తాన్ అప్పగించాలని డిమాండ్ చేశారు.. ఆ ముగ్గురు ఉగ్రవాదులను అప్పగించిన తర్వాతనే పాక్‌తో భారత్ చర్చలకు వెళ్లాలని సూచించారు.. ఉగ్రవాదులను అంతం చేసేంత వరకు నిద్రపోకూడదన్నారు..
ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదైన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. ఈ అక్రమాల్లో మరింత మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్సార్, ఏ2గా క్యామ్ సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో ఏపీపీఎస్సీ కమిషన్ వింగ్ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్రను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ చెప్పిన పనులను వెంకట సుబ్బయ్య చక్కబెట్టినట్టు గుర్తించారు.
సరిహద్దులో భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆగినా.... బెజవాడలో బ్రదర్స్ వార్ మాత్రం ఆగే సూచనలు కనిపించడం లేదు. పైగా పీక్స్‌కు చేరుతోంది. తనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని నేరుగా మాజీ ఎంపీ కేశినేని నాని పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేయడంతో... మేటర్ మాంఛి రసకందాయంలో పడింది.
బాపట్ల జిల్లా.... అద్దంకి నియోజకవర్గం అంటేనే వర్గ రాజకీయాలకు కేరాఫ్. ఒకప్పుడు ఇక్కడ కరణం బలరాం వర్సెస్ బాచిన చెంచు గరటయ్యగా రాజకీయాలు నడిచేవి. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ కరణం, మరి కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ బాచిన కుటుంబాల పొలిటికల్ పోరు నడిచింది. రవికుమార్ నియోజకవర్గంలో పాతుకుపోవడంతో... ప్రత్యర్ధి ఎవరైనా గొట్టిపాటికి మరోవైపునే డీకొట్టాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నది లోకల్ టాక్.