కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. నిబంధనలు అతిక్రమించిన పోలీసు అధికారులను ఎవర్ని వదలం.. కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
రెడ్ బుక్ మరువను... కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని వదలను అంటూ మరోసారి స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4వేల పెన్షన్ ఇవ్వడం లేదు. అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచాం, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. వాటిగురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని పిలుపునిచ్చారు.
వాటర్ క్యాన్ ఓ యువకుడి ప్రాణం తీసింది..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాటర్ క్యాన్ మూలంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బావిలో ఈత కొట్టేందుకు యువకుడు వాటర్ క్యాన్ డబ్బాను కట్టుకొని ఈతకు వెళ్లగా.. ఆ క్యాన్ కు హోల్ పడి నీళ్లు లోనికి వెళ్లి ఆ యువకుడు నీట మునిగి మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది..
ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆ రెండు దేశాలకు బిగ్ షాక్ తగిలింది.. టర్కీ, అజర్ బైజాన్ కు ఝలక్ ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ .. ఆ దేశాలకు టూరిజం, ట్రావెల్ బాయికాట్ చేస్తూ టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ నిర్ణయం తీసుకుంది..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీని ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC).. WTC ఛాంపియన్స్ మరియు రన్నరప్‌లకు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్టు వెల్లడించింది.. దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ప్రైజ్ పూల్‌ను ఐసీసీ ఈ రోజు ప్రకటించింది.. 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) విజేతలకు 3.6 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే.. భారత కరెన్సీ ప్రకారం.. 30.79 కోట్ల రూపాయలు అందజేయనుంది..
వల్లభనేని వంశీ మోహన్‌కు ఊహించని ఝలక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.. వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు అయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం.. వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనుంది కోర్టు.. అయితే, ఈ సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో మాజీ ఎమ్మల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసులో…
నాన్నా.. నన్ను రోజూ చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు. బయటకు రానివ్వడం లేదు.. నన్ను తిరిగి భారత్‌కు తీసుకువెళ్లు నాన్న అంటూ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ యువకుడు ఫోన్లో తండ్రికి తన గోడును వెలిబుచ్చాడు.. బాధితుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరుకు చెందిన కాలేషా, బీబీల కుమారుడు నజీర్‌బాషా డిసెంబర్లో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు.
ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు..
టీడీపీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిపాదనకు పార్టీ పొలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది. మూడుసార్లు, ఆరేళ్లుగా పదవిలో ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు.