మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.. కాకాణిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది హైకోర్టు.. కా
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. 9 అంశాలపై చర్చించారు.. ఇక, బార్ లైసెన్స్‌ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.. యువజన, పర్యాటక శాఖలో జీవోల ర్యాటిఫికేషన్‌కు మంత్రవర్గం ఆమోదం తెలిపింది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కీలక అంశాలపై చర్చించారు.. నెలలో నాలుగు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని స్పష్టం చేశారు..
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీకి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ.. దీని కోసం రేపు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు మున్సిపల్ శాఖ అధికారులు.. మాస్టర్ ప్లాన్, రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను త్వరితగతిన జారీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు మున్సిపల్ శాఖ అధికారులు.. రేపు ఉదయం నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ లో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీకి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ.. దీని కోసం రేపు…
సామర్లకోట మున్సిపాలిటీలో సొంత పార్టీ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు.. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరుతూ కలెక్టర్ కి లేఖ రాశారు 22 మంది వైసీపీ కౌన్సిలర్లు..
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ జరుగుతోంది.. అయితే, విచారణ పేరుతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి భార్య పద్మావతి.. కడప జిల్లా పులివెందులలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన పద్మావతి.. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై పోలీసులు మళ్లీ మా కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.. విచారణ పేరుతో మా కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు.. కేసు విషయం పోలీసులు పొద్దుటూరు, బెంగళూరులో కలిశారని తెలిపారు..
టీటీడీలో సంస్కరణలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏకంగా సీఎం చంద్రబాబు టీటీడీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు 50 సంవత్సరాలకు అనుగుణంగా భక్తులకు కల్పించే సౌకర్యాలపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం..
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. చంద్రబాబు, లోకేష్ కుటుంబాలను బంగారుమయం చేసుకుంటారేమో.. కానీ, పేద ప్రజలకు చేసేదేమీ లేదన్నారు.. చంద్రబాబు మీటింగులకు వచ్చిన జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.. ఇక, పవన్ కల్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నారో అర్ధం కావటం లేదు అని ఎద్దేవా చేశారు.
సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి.. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెడతాడు. సమాజంలో ఉన్న 20 శాతం పేదవాళ్ల బాగోగులకు 10 శాతం మందికి అప్పగిస్తాడంట? రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?
టీడీపీ - జనసేన - బీజేపీ ఒకే ఆలోచనతో ఉన్నాయి.. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ రోజు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు..