ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ విడతలవారీగా జరుగుతోంది. తాజాగా డీసీసీబీ, మార్కెట్ యార్డ్ కమిటీల పదవుల పందేరం నడుస్తోంది. అదే సమయంలో అసంతృప్త స్వరాలు కూడా పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో టికెట్లు రానివాళ్ళతో పాటు పార్టీ వీర విధేయులకు ప్రాధాన్యం ఇస్తున్నామని టీడీపీ అధిష్టానం చెబుతున్నా.... అదే రేంజ్లో ఉన్న అందర్నీ సంతృప్తి పరచడం మాత్రం సాధ్యం కావడం లేదట.
వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. సరదా కోసం ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు కావడంతో మల్లెపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి . బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లిలో వేసవి సెలవులు కావడంతో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీపంలోని బంధువుల ఇళ్ల దగ్గరకు వెళ్లి వెతికినా ఆచూకీ తెలియరాలేదు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూముల వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూములను ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో సంబంధిత శాఖల భూములు అక్రమణలకు గురవుతుంటే రక్షించలేని వారిని బాధ్యులను చేయాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసిందని గుర్తు చేశారు పవన్ కల్యాణ్.
ఆలూరు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు.. గుమ్మనూరు నారాయణ ఇంట్లో సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండాల్సిన సమయంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. ఓవైపు వానలు దంచికొడుతుంటూ.. మరోవైపు ఎండలు బంబేలిస్తున్నాయి.. ఇక, రానున్న రెండు రోజుల్లూను.. భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
వల్లభనేని వంశీ మోహన్‌కు భారీ ఊరట దక్కింది.. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. రెండు సార్లు కూడా బెయిల్ తిరస్కరించింది కోర్టు.. దీంతో.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఆ పిటిషన్‌పై ఇటీవల ఇరు వర్గాల తరపు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు.. ఈ రోజు వల్లభనేని వంశీ మోహన్‌కు బెయిల్ మంజూరు చేసింది..
కూటమి ప్రభుత్వం పాలన, సీఎం చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన నడుస్తుందని వ్యాఖ్యానించిన ఆమె.. వైసీపీ మహిళా కార్యకర్తలు నారావారి నరకాసుర వధ చేసేందుకు నడుం బిగించాలి అంటూ పిలుపునిచ్చారు... చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, అవమానాలు, అత్యాచారాలు, వేధింపులు.. ఇవే సూపర్ సిక్స్‌లు అంటూ ఎద్దేశా చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయార్జన శాఖలపై మరోసారి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టెక్నాలజీ సహాయంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది అన్నారు సీఎం చంద్రబాబు.. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
2021 మే 14వ తేదీన నాపై రాజద్రోహం కేసు పెట్టి నన్ను తీసుకెళ్లి ఏం చేసారో అందరికీ తెలుసు.. అదే వాళ్ల చావుకు వచ్చిందన్నారు.. నా రచ్చబండ ద్వారా వాళ్లు ఎంత పనికిమాలిన వాళ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు.. అందుకే ప్రజలు కక్షతో ఓడించారనా పేర్కొన్నారు.. రేపు నా పుట్టినరోజు, నన్ను కొట్టిన తర్వాత ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజు.. అందుకే, రేపు ప్రతీకార దినోత్సవాన్ని స్థానిక రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ జరుపుతున్నాం అని ప్రకటించారు..