ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్ సిగ్నల్..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.. కీలక నిర్ణయాలకు ఆమోముద్ర వేశారు.. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. ఈ ఏడాదిలో 25 కేబినెట్ సమావేశాలు జరిగాయి.. కొన్ని వందల నిర్ణయాలు ఇప్పటి వరకు తీసుకున్నాం.. సీఎంకు ఇష్టం వచ్చినప్పుడు కేబినెట్ పెట్టడం.. సీఎంకు ఇష్టమైన ఎజెండాతో కేబినెట్ సమావేశాలు పెట్టలేదు.. మంత్రుల అభిప్రాయంతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు.. 10 సెంట్ల స్థలం నుంచి ఎకరాల కేటాయింపు వరకు కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు.. ఏపీ సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రకారం మరో విడత భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు పార్థసారథి.. అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్.. విద్యా సంస్థలు.. ఆస్పత్రులు అందించే విధంగా భవిష్యత్ అవసరాల కోసం.. ల్యాండ్ పూలింగ్ జరుగుతుందన్నారు.. 2015లో కూడా 35 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగింది.. అసైన్‌మెంట్, భూముల విషయంలో స్థానిక అధికారులతో విచారణ తర్వాత భూ సమీకరణ జరుగుతుందన్నారు. అన్ని నియమ నిబంధనలు ప్రకారం.. ఆధార్, పాస్‌పోర్ట్ వివరాల ఆధారంగా ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది.. రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చే వారికి మెరుగైన ప్యాకేజ్ అందిస్తున్నాం అన్నారు.. అమరావతిలో జీఏడీ టవర్.. హెచ్‌వోడీ టవర్.. ఎన్సీసీ… షాపూర్‌జీ పల్లంజీకి, ఎల్ అండ్ టీకి టెండర్ ఆర్డర్ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు..
బనకచర్లపై కేబినెట్‌లో కీలక చర్చ.. మనం కౌంటర్ ఇవ్వాలి..!
పోలవరం-బనకచర్లపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.. అయితే, ఏపీ కేబినెట్ సమావేశంలో బనకచర్లపై కీలక చర్చ సాగింది.. పోలవరం బనకచర్ల పై తెలంగాణ వాళ్లు అందరూ మాట్లాడుతున్నారు.. నిన్న తెలంగాణ కేబినెట్‌లో వాళ్లు డిస్కస్ చేశారు.. మనం కూడా మన వాదన వినిపించాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. వాళ్లు అనుమతి లేని ప్రాజెక్టులను కూడా కడుతున్నారు.. ఇంకా, అనేక ప్రాజెక్టులు కడుతున్నారు.. వాళ్లు వాడుకోగా మిగిలిన నీళ్లు కదా మనం వాడుకొనేది అన్నారు సీఎం చంద్రబాబు.. మనం వరద జలాలను కదా వాడుకుంటమనేదన్న సీఎం చంద్రబాబు.. దీనిపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో.. మనం చెప్పాలని మంత్రులకు సూచించారు.. ప్రాజెక్టులపై వాళ్లు (తెలంగాణ) రాజకీయం చేస్తున్నారు… మనం ప్రాజెక్ట్ మీద జనానికి బాగా అర్థమయ్యే రీతిలో చెబితే బాగుంటుందన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, CRDA పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వం భూములు 2019కు ముందు 6 ఏళ్లు అనుభవ దారు ఎవరు ఉంటారో వారికే నష్ట పరిహారం ఇవ్వాలి అన్నారు సీఎం.. జిల్లా స్థాయిలో ఏడాది పాలన పై జిల్లా ఇంఛార్జ్ మంత్రి సమావేశం పెట్టాలి.. నియోజకవర్గ స్థాయిలో MLA ఇటువంటి సమావేశం ఏర్పాటు ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలి అని ఆదేశించారు.. జులై 1 నుంచి ఏడాది పాలన పై MLA లు ఇంటింటికి తిరిగి చెప్పాలి.. కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని వెళ్లాలని కోరారు చంద్రబాబు..రెవెన్యూ సమస్యలు అన్ని ఏడాది లోపు సమస్యలు అన్ని పరిష్కరించాలని స్పష్టం చేశారు.. ఎక్కువగా రెవెన్యూపై మనకు సమస్యలు వస్తున్నాయి.. వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించి పరిష్కరించాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసిన పోలీసులు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పల్నాడు జిల్లా పర్యటన చుట్టూ ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది.. జగన్ పర్యటనలో ఇద్దరు మృతిచెందిన ఘటనపై మొదట లైట్‌గా తీసుకున్నటే కనిపించినా.. ఆ తర్వాత వెలుగు చూసిన వీడియోలతో కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో దూకుడు పెంచారు.. అందులో భాగంగా.. ఈ రోజు వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నల్లపాడు పోలీసులు.. పార్టీ కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు.. ఇటీవల జగన్.. సత్తెనపల్లి పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.. ఇక, వైఎస్ జగన్ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందడంపై ఇప్పటికే కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పుడు ఆ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేశామని నల్లపాడు పోలీసులు చెబుతున్నారు..
ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు.. ఇది కూటమి ప్రభుత్వ విజయం..
అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని మంత్రుల కమిటీ సమావేశం పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి నారా లోకేష్ చాంబర్ లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు టీజీ భరత్, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి హాజరై.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోగా, అందులో ఇప్పటికే వివిధ రంగాల్లో సుమారు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఇందులో అత్యధికంగా ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్నాయన్నారు మంత్రులు.. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 73 వేల ఉద్యోగాలు, టూరిజం రంగంలో 49,765 ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఇక, ఎంఎస్ఎంఈ రంగంలో గత పదేళ్లలో సగటున 50వేల ఉద్యోగాలు మాత్రమే లభించగా, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 5 రెట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటురంగంలో కల్పిస్తున్న ఉద్యోగాలను గ్రామ సచివాలయాల ద్వారా ట్రాక్ చేసి పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని మంత్రులు సూచించారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, సమిష్టి కృషితో ఈ లక్ష్యాన్ని అధిగమించి తీరుతామని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని, అక్కడ అసంఘటిత రంగంలో ఇప్పటికే 10 వేల మంది పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అత్యధిక ఉద్యోగాలు లభించే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ సెక్టార్లపై అధికారులు దృష్టిసారించాలని అన్నారు మంత్రి నారాయణ..
మీ చుట్టుపక్కల కబ్జాలపై హైడ్రాకు సమాచారం ఇవ్వాలా..? నంబర్ నోట్ చేసుకోండి..
చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే తమకు తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు హైడ్రా విజ్ఞప్తి చేసింది. కబ్జాలపై 8712406899 కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని హైడ్రాధికారులు వెల్లడించారు. నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నగరానికి వరద ముప్పు తప్పించాలంటే గొలుసుకట్టు చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. వర్షం పడితే వరద నీరు రోడ్లు, నివాస ప్రాంతాలను ముంచెత్తకుండా.. నేరుగా చెరువుల్లోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్న వెల్లడించారు. చెరువులు, నాలాలు ఆక్రమణలు ఆపడం హైడ్రా ముందున్న లక్ష్యమని చెప్పారు. కబ్జాల సమాచారాన్ని అందించాలంటే.. హైడ్రా వాట్సాప్ నంబరు 8712406899 కు ఫోటోలు లొకేషన్ షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే సంబంధిత విభాగం అధికారులు అక్కడికి చేరుకుని సమగ్ర విచారణ చేపడతారు.
బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? కేసీఆర్‌కి సీఎం రేవంత్ సవాల్..
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు. చంద్రబాబుతో కలిసి ఉండే వాడినే అయితే అప్పుడే వెళ్లి ఉండే వాడిని కాదా? అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో కి వచ్చిన.. నీ మాదిరి మోసం చేయలే అని విమర్శించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేయలేదని.. బనకచర్ల పై చర్చ కోసం కేసీఆర్ స్పీకర్ కు లేఖ రాయాలన్నారు. తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని.. కేసీఆర్ హయాంలో ఏపీ ముచుమర్రి కట్టారు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసింది కూడా మీ హయాంలోనే అన్నారు.
బ్లాక్ బాక్స్ పై ఇండియాలోనే విచారణ : రామ్మోహన్ నాయుడు
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఇండియన్ ఫ్లైట్ యాక్సిడెంట్ లోనే అత్యంత ప్రమాదకరమైనదిగా దీన్ని చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకునే బ్లాక్ బాక్స్ విచారణ మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ బ్లాక్ బాక్స్ ను విదేశాలకు తరలించి అక్కడ విచారణ జరిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. ఫిక్కీ, కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పుణెలో జరిగిన హెలికాఫ్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్ బాక్స్ ను విదేశాలకు తరలించలేదు. ఇండియాలోనే ఉంది. దీన్ని ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తోంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక బ్లాక్ బాక్స్ విచారణలో ఎలాంటి నిజాలు తెలుస్తాయా అని అంతా వెయిట్ చేస్తున్నారు.
రైల్వే టికెట్ ఛార్జీల పెంపు.. ఎంతంటే..?
ఇండియన్ రైల్వేస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏసీ, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ సహా సుదూర రైళ్ల ఛార్జీలను పెంచింది. వివిధ కేటగిరీల రైళ్లలో ధరలు పెరిగాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెరగనుండగా.. ఏసీ కేటగిరీ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతాయి. ఈ కొత్త మార్పు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. సబర్బన్, సీజన్ రైలు టిక్కెట్లలో ఎటువంటి మార్పు ఉండదు. 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదు. 500ల కి.మి దాటితేనే పెరుగుదల వర్తిస్తుంది. ఉదాహరణకు… ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నాకు రాజధాని రైలు ఛార్జీ రూ.2485 కాగా, ఏప్రిల్ 1 నుంచి ఇది రూ.2505కి పెరుగుతుంది. అంటే కిలోమీటరుకు 2 పైసలు పెరిగింది. ఢిల్లీ నుంచి పాట్నాకు దూరం దాదాపు 1000 కిలోమీటర్లు. అదేవిధంగా.. ఢిల్లీ – పాట్నా మధ్య నడుస్తున్న సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ 3A ఛార్జీ ప్రస్తుతం రూ.1350 ఉండగా, జూలై 1 నుంచి దాదాపు రూ.20 పెరుగుతుంది. అంటే.. ఛార్జీ రూ.1370కి పెరుగుతుంది. అదే సమయంలో.. ఢిల్లీ-పాట్నా స్లీపర్ క్లాస్ ఛార్జీ ప్రస్తుతం రూ.510గా ఉంది. ఇది 10 రూపాయలు పెరుగి రూ. 520కి చేరుతుంది.
“ఆపరేషన్ సిందూర్”లో పని చేశారని.. భర్య హత్య కేసులో మినహాయింపు ఇవ్వలేం..
వరకట్నం కోసం భార్యను హత్య చేశాడు ఓ భర్త.. కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. కోర్టులో ఆ భర్త విచిత్ర కోరిక కోరాడు. ఎంతటి వ్యక్తులకైనా చట్టం ఒక్కటే అని తెలియదేమే విచిత్ర కోరిక కోరాడు. తాను ‘ఆపరేషన్ సిందూర్’లో పని చేశానని.. ఈ కేసులో మినహాయింపు కల్పించాలని ఆ కమాండో సుప్రీంకోర్టును కోరాడు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ కమాండో కోరికపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నంత మాత్రాన కేసు నుంచి రక్షణ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ కేసు పంజాబ్ రాష్ట్రానికి చెందినది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లోని బ్లాక్ క్యాట్ కమాండో యూనిట్‌లో పనిచేస్తున్న ఓ కమాండోపై హత్య అభియోగాలు ఉన్నాయి. వరకట్నం కోసం తన భార్యను చంపినట్లు కేసు నమోదు కాగా.. పంజాబ్‌లోని ఓ ట్రయల్ కోర్టు 2004లో దోషిగా తేల్చింది. 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో ఆ కమాండో పంజాబ్, హర్యానా హై కోర్టును ఆశ్రయించాడు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అనంతరం అతడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. నాను ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నానని.. ఈ కేసులో మినహాయిచు కల్పించాలని పేర్కొన్నాడు. దీంతో కోర్టు స్పందించింది. ఈ కారణంతో దారుణ ఘటన నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. మినహాయింపులు కల్పించలేమని కుండబద్దలు గొట్టింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల గడువు ఇచ్చింది.
ట్రంప్ వార్నింగ్.. దాడులు ఆపేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటన..
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత రెండు దేశాలు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యారు. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఉందని.. సైనికులను వెనక్కి రప్పించాలంటూ ఇజ్రాయెల్ ను ఆదేశించారు. దీంతో దాడులు చేసినట్టు ఒప్పుకున్న ఇజ్రాయెల్.. తమ అధినేత నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడిన తర్వాత దాడులు ఆపేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇక నుంచి మరో దాడి చేయబోమని వెల్లడించింది. అటు ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. రెండు దేశాల మధ్య 12 రోజుల యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు. ‘సీజ్ ఫైర్ ఒప్పందం చేసిన తర్వాత ఇరాన్ మాపై మూడు చోట్ల దాడులు చేసింది. అందుకే మేం ఇరాన్ రాడార్ వ్యవస్థలపై దాడులు చేశాం’ అంటూ ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే ఒప్పందాన్ని తాము ఉల్లంఘించామని ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము అస్సలు ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని తెలిపింది. సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు రెండు దేశాలు ప్రకటించాయి.
శృతి హాసన్ ట్విట్టర్(X) అకౌంట్ హ్యాక్!
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న శృతిహాసన్ ఇప్పుడు పెద్దగా తెలుగు సినిమాలు చేయడం లేదు. చేస్తున్న కొన్ని సినిమాలతో వార్తలో నిలుస్తున్న ఆమె ఇప్పుడు అనుహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్ ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయింది. సుమారు ఎనిమిది మిలియన్ల నుండి ఫాలోవర్స్ ఉన్న ఆమె అకౌంట్ ని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ బ్యాచ్ హ్యాక్ చేసింది. చేయడమే కాదు తమకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. భారీగా ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ అకౌంట్లను టార్గెట్ గా చేసుకుని ఈ క్రిప్టో కరెన్సీ బ్యాచ్ హ్యాకింగ్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే శృతిహాసన్ కి సుమారు 7.8 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉండడంతో శృతిహాసన్ అకౌంటు మీద కన్నేశారు. ఇక చివరిగా తెలుగులో సాలార్ సినిమాలో కనిపించిన ఆమె ప్రస్తుతానికి తమిళ కూలీ, ట్రైన్, జననాయగన్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే సాలార్ సెకండ్ పార్ట్ లో కూడా ఆమె నటించబోతోంది.
ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ నిలిచింది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా అద్భుతంగా ఉండాలని సాదాసీదా కథలను ఎంచుకోకుండా సాలిడ్ ప్రాజెక్టులను మాత్రమే ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు వెంకీ మామ. కొన్నాళ్లపాటు కథలు విన్న ఆయన తర్వాత వెకేషన్ కి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు మళ్లీ లైన్ లో కూర్చున్న ఆయన ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా నెల రోజులు పాటు డేట్స్ ఇచ్చాడట. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైపోయింది.