YS Jagan Annaprasana: నచ్చిన నేత దగ్గరకు వెళ్లి.. తమ చిన్నారికి పేరు పెట్టాలని ఎంతో మంది అడుగుతుంటారు.. ఇలా ఇప్పటికే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఎంతో మంది చిన్నారులకు పేర్లు పెట్టారు.. జగన్ పాదయాత్ర, ఇతర పర్యటనల సమయంలో ఇలాంటి ఘటనలు చూశాం.. అంతే కాదు.. మరికొన్ని సార్లు చిన్నారులకు అన్నప్రాసన చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.. ఇక, ఇప్పుడు.. ఓ చిన్నారికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అన్నప్రాసన జరిగింది.. చిన్నారి ఆద్విక్‌ను ముద్దు చేస్తూ.. అన్నప్రసాన చేశారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
Read Also: Kingdom : అతని వల్లే కింగ్ డమ్ వాయిదా పడుతోందా..?
తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సాక మణికుమారి, సాక ప్రసన్నకుమార్ (జెడ్పీ మాజీ ప్రతిపక్షనేత).. తమ మనవడు చిన్నారి ఆద్విక్‌కు అన్నప్రాసన చేయాలని.. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కోరారు మణికుమారి దంపతులు, ఆద్విక్ తల్లిదండ్రులు డాక్టర్ శృతి, ప్రేమ్‌కుమార్.. దీంతో, చిన్నారి ఆద్విక్‌ను ఎత్తుకుని.. ముద్దాడి అన్నప్రాసన చేశారు వైఎస్ జగన్.. ఇక, జగన్ చేతుల మీదుగా తమ చిన్నారికి అన్నప్రాసన జరగడంతో.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.. మరోవైపు, తనను ఎత్తుకుని ముద్దు చూస్తున్న వైఎస్ జగన్ వైపు.. అలాగే చూస్తున్నాడు ఆ బుడ్డోడు.. ఇప్పుడో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..