YS Jagan Car Seized: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పల్నాడు జిల్లా పర్యటన చుట్టూ ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది.. జగన్ పర్యటనలో ఇద్దరు మృతిచెందిన ఘటనపై మొదట లైట్‌గా తీసుకున్నటే కనిపించినా.. ఆ తర్వాత వెలుగు చూసిన వీడియోలతో కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో దూకుడు పెంచారు.. అందులో భాగంగా.. ఈ రోజు వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నల్లపాడు పోలీసులు.. పార్టీ కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు.. ఇటీవల జగన్.. సత్తెనపల్లి పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.. ఇక, వైఎస్ జగన్ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందడంపై ఇప్పటికే కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పుడు ఆ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేశామని నల్లపాడు పోలీసులు చెబుతున్నారు..