Amaravati Development: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే భూమి సేకరించిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే.. మరోవైపు, రెండో విడత భూ సమీకరణపై దృష్టిసారించింది.. దీనికి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే, అమరావతి అభివృద్ది విషయంలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ).. ఎపీ సీఆర్‌డీఏ విజ న్ 2047 పేరుతో ఆన్‌లైన్‌లో ప్రశ్నావళి రూపొందించింది సీఆర్‌డీఏ..
Read Also: Etala Rajender: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్..
విజన్ లో అమరావతి ప్రాంత ప్రజలు భాగస్వాములై తమ ఆలోచనలు, సూచనలు, ప్రాధాన్యతలు, అభిప్రాయాలు చెప్పాలని విజ్ఞప్తి చేసింది.. 8,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద ప్రణాళిక ప్రాంతంగా సీఆర్‌డీఏ ఉందని వెల్లడించింది.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56 మండలాల పరిధిలో సీఆర్‌డీఏ విస్తరించి ఉన్నట్టు పేర్కొంది.. మంగళగిరి, తాడేపల్లి లాంటి పట్టణాలతో పాటు 900 గ్రామాలున్న ప్రాంతమని వెల్లడించింది సీఆర్‌డీఏ.. ఇక, సీఆర్‌డీఏ విజన్ 2047పై పలు ప్రశ్నలు వేస్తూ.. సమాధానాలు ఇవ్వాల్సిందిగా ప్రజలకు సూచించింది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ.. ఇంకేముందు.. మన రాజధానిలో.. మీరు ఏముండాలి ? అనుకుంటున్నారు.. ఎలా డెవలప్‌చేయాలని సూచిస్తారు..? మీరిచ్చే సలహాలు.. సూచనలు.. మీ ఆలోచనలు, ప్రణాళికలు.. ఇలా అన్నీ.. సీఆర్‌డీఏకు చేరవేయండి..