AP Government: ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు.. ఇది కూటమి ప్రభుత్వ విజయం..
- ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు.. ఇది కూటమి ప్రభుత్వ విజయం..
- 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని అధిగమించి తీరుతాం..
- అధికార యంత్రాంగం యావత్తు మిషన్ మోడ్ లో పనిచేయాలి..
- అధికారులకు మంత్రుల కమిటీ సమావేశం దిశానిర్దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని మంత్రుల కమిటీ సమావేశం పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి నారా లోకేష్ చాంబర్ లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు టీజీ భరత్, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి హాజరై.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోగా, అందులో ఇప్పటికే వివిధ రంగాల్లో సుమారు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఇందులో అత్యధికంగా ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్నాయన్నారు మంత్రులు.. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 73 వేల ఉద్యోగాలు, టూరిజం రంగంలో 49,765 ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
Read Also: YS Jagan Car Seized: జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసిన పోలీసులు
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
ఇక, ఎంఎస్ఎంఈ రంగంలో గత పదేళ్లలో సగటున 50వేల ఉద్యోగాలు మాత్రమే లభించగా, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 5 రెట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటురంగంలో కల్పిస్తున్న ఉద్యోగాలను గ్రామ సచివాలయాల ద్వారా ట్రాక్ చేసి పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని మంత్రులు సూచించారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, సమిష్టి కృషితో ఈ లక్ష్యాన్ని అధిగమించి తీరుతామని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని, అక్కడ అసంఘటిత రంగంలో ఇప్పటికే 10 వేల మంది పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అత్యధిక ఉద్యోగాలు లభించే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ సెక్టార్లపై అధికారులు దృష్టిసారించాలని అన్నారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?